Stock Market: ఆల్ టైం హైకి చేరిన సెన్సెక్స్, నిఫ్టీ

Sensex, Nifty hit all-time highs
x

Stock Market: ఆల్ టైం హైకి చేరిన సెన్సెక్స్, నిఫ్టీ

Highlights

Stock Market: లక్ష పాయింట్లే లక్ష్యంగా సెన్సెక్స్ దూకుడు

Stock Market: స్టాక్ మార్కెట్లలో జోష్ కంటిన్యూ అవుతోంది. కొనుగోళ్ల వెల్లువతో షేర్లు సరికొత్త లెవెల్స్ టచ్ చేస్తున్నాయి. ఇవాళ వరుసగా ఆరో సెషన్ లో కీలక సూచీలు సరికొత్త మైలురాళ్లను అధిగమించాయి. సెన్సెక్స్ 86 వేల మార్క్‌కు చేరువ కాగా, నిఫ్టీ తొలిసారిగా 26 వేల 200 పాయింట్లను క్రాస్ చేసింది. మార్కెట్ జోరుతో పలు షేర్లు రికార్డు లెవెల్స్ చేరుకున్నాయి.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్ధిక మందగమన సంకేతాలు.. ఇలా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్టాక్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. సరికొత్త లెవెల్స్ కు చేరువవుతూ మున్ముందుకే దూసుకెళుతున్నాయి. ఊహించని గరిష్ట స్ధాయిలను చేరుకుంటున్నాయి. పలు రంగాల షేర్లలో బైయింగ్ జోరుతో ఏడాది గరిష్ట స్ధాయిలను నమోదు చేస్తున్నాయి. కొనుగోళ్ల వెల్లువ‌తో బీఎస్ఈ సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 666 పాయింట్లు పెరిగి 85 వేల 836 పాయింట్లకు ఎగ‌బాకింది. నిఫ్టీ 211 పాయింట్లు లాభ‌ప‌డి 26 వేల 216 పాయింట్ల వ‌ద్ద క్లోజ‌యింది.

సెన్సెక్స్, నిఫ్టీ ఇదే జోరును కొన‌సాగిస్తాయ‌ని, ఈ ఆర్ధిక సంవత్సరం చివ‌రి నాటికి సెన్సెక్స్ ల‌క్ష పాయింట్లకు చేరువ‌వుతుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ముడి చమురు ధరలు దిగివచ్చి, వడ్డీ రేట్లు అందుబాటులోకి వస్తే స్టాక్ మార్కెట్ల జోరుకు అడ్డేమీ ఉండదని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories