2022కు నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు గుడ్‌బై

Sensex Ends 293 Points Down on Last Day of 2022
x

2022కు నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు గుడ్‌బై

Highlights

Business News: దేశీయ స్టాక్‌ మార్కెట్లు 2022 చివరి సెషన్‌కు నష్టాలతో ముగింపు పలికాయి.

Business News: దేశీయ స్టాక్‌ మార్కెట్లు 2022 చివరి సెషన్‌కు నష్టాలతో ముగింపు పలికాయి. ట్రేడింగ్ ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు కొంత బూస్ట్‌నిచ్చాయి. ఫలితంగా మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. కానీ మధ్యాహ్నం తర్వాత క్రమంగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. కొత్త సంవత్సరం ముగింపు నేపథ్యంలో పోర్ట్‌ఫోలియోను పునర్‌వ్యవస్థీకరించుకోవడంలో భాగంగా మదుపర్లు విక్రయాలకు దిగారు.

ICICI బ్యాంక్‌, HDFC జంట షేర్ల వంటి దిగ్గజ స్టాక్స్‌లోని బలహీనత సైతం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఇంట్రాడే గరిష్టాల నుంచి సెన్సెక్స్‌ 550 పాయింట్లకు పైగా నష్టపోయింది. మొత్తంగా ఈ ఏడాది సెన్సెక్స్‌ 4.4 శాతం, నిఫ్టీ 4.3 శాతం పెరిగాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 293 పాయింట్లు నష్టపోయి 60 వేల 840 వద్ద ముగిసింది. నిఫ్టీ 85 పాయింట్ల నష్టంతో 18 వేల 105 వద్ద స్థిరపడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories