Stock Market: కొనసాగుతున్న లాభాల జైత్రయాత్ర.. సెన్సెక్స్‌ @ 75,000

Sensex crosses 75,000 for 1st time, Nifty hits record high
x

Stock Market: కొనసాగుతున్న లాభాల జైత్రయాత్ర.. సెన్సెక్స్‌ @ 75,000

Highlights

Stock Market: సరికొత్త రికార్డులు సాధిస్తున్న సెన్సెక్స్, నిఫ్టీ

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో లాభాల జోరు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం సూచీలు సరికొత్త గరిష్ఠాల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలోనూ బుల్‌ ఆ పరుగును కొనసాగిస్తోంది. సెన్సెక్స్‌ 75 వేల కీలక మైలురాయిని అందుకుంది. నిఫ్టీ 22 వేల 768 వద్ద సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు రాణిస్తుండడం విశేషం. ఉదయం 22 వేల 765 వద్ద సానుకూలంగా ప్రారంభమైన సెన్సెక్స్‌ ఆరంభంలో కాస్త నెమ్మదించింది. ఐటీ, స్థిరాస్తి రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో పుంజుకొని సరికొత్త శిఖరాలను చేరింది. సెన్సెక్స్‌ సైతం తొలిసారి 75వేల మైలురాయిని తాకి 75 వేల 124 వరకు ర్యాలీ అయ్యింది. మార్చి 6న 74వేల మార్క్‌ను తాకిన ఈ సూచీ కేవలం 24 సెషన్లలోనే మరో 1000 పాయింట్లు పెరగడం విశేషం.

70వేల నుంచి 75వేలకు చేరడానికి దాదాపు నాలుగు నెలలు పట్టింది. మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ చరిత్రలోనే తొలిసారిగా నిన్న 400 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సెన్సెక్స్‌ 298 పాయింట్ల లాభంతో 75 వేల 41 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 22 వేల 740 వద్ద కొనసాగుతోంది. మరోవైపు సెన్సెక్స్‌-30 సూచీలో టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి కీలక షేర్లు రాణిస్తుండడం సూచీల్లో ఉత్సాహం నింపింది. రిలయన్స్‌, ఎన్‌టీపీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టైటన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, మారుతీ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories