Second Hand Cars: కారు అమ్మినప్పుడు మంచి ధర రావాలంటే ఏం చేయాలో తెలుసా..!

Second Hand Cars are not Getting the Right Rates Just Follow These Tricks
x

Second Hand Cars: కారు అమ్మినప్పుడు మంచి ధర రావాలంటే ఏం చేయాలో తెలుసా..!

Highlights

Second Hand Cars: మార్కెట్‌లో కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కార్లను విడుదల చేస్తూనే ఉంటాయి.

Second Hand Cars: మార్కెట్‌లో కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కార్లను విడుదల చేస్తూనే ఉంటాయి. ప్రజలకు మంచి ఫీచర్లు, మెరుగైన నాణ్యత, మైలేజీతో కూడిన మంచి కారును అందించడమే లక్ష్యంగా పెట్టుకుంటాయి. కస్టమర్లు కూడా కొత్త కార్లను తీసుకోవాలనుకుంటున్నారు కానీ పాత కార్లని విక్రయించలేకపోతారు. ఎందుకంటే వాటికి సరైన ధర రాకపోవడమే కారణం. అయితే పాత కారుకి మంచి రేట్‌ రావాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

ఏదైనా వాహనానికి అవసరమైన పత్రాలను కలిగి ఉండటం చాలా ముఖ్యం. లేదంటే చలాన్ రూపంలో భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. RC, ఇన్సూరెన్స్‌, పొల్యూషన్, పెండింగ్ చలాన్ మొదలైన పేపర్లని దగ్గర ఉంచుకోవాలి. లేదంటే కారు అమ్ముడుపోదు. ఎందుకంటే కాగితాలు లేని కారుని ఎవరూ కొనుగోలు చేయరు. ఒకవేళ కొనుగోలు చేసినా తక్కువ ధర చెల్లిస్తారు.

సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసే ముందు ఏ కస్టమర్ అయినా దానిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. కారు టెస్ట్ డ్రైవ్ కోసం కస్టమర్‌ని మీరే స్వయంగా అడగండి. ఇది కారుపై నమ్మకాన్ని పెంచుతుంది. కస్టమర్ కారు అసలు స్థితి గురించి తెలుసుకుంటారు. టెస్ట్ డ్రైవ్ తర్వాత కస్టమర్ కారును ఇష్టపడితే మంచి ధర చెల్లించే అవకాశాలు ఉంటాయి.

కారు పరిశుభ్రత చాలా ముఖ్యం. కారు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ ఖచ్చితంగా కారు లోపల, వెలుపల పరిశుభ్రతను చూస్తారు. కారు ఫస్ట్ లుక్ ఏ వ్యక్తినైనా ఆకర్షించడానికి సరిపోతుంది. కారు సీటు, మ్యాట్‌లు, డోర్లు, కారు కింద, బానెట్, డిగ్గీ మొదలైన వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈ ప్రదేశాల్లో దుమ్ము, ధూళి పేరుకుపోయే అవకాశాలు ఎక్కువ. వాటిని క్లీన్ చేయండి. అప్పుడు కస్టమర్ నుంచి మంచి ధరలను పొందవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories