SBI: ఖాతాదారులకి గుడ్‌న్యూస్‌.. త్వరలో మరో కొత్త సేవని ప్రారంభించనున్న ఎస్బీఐ..!

SBI Will Soon Launch Yono 2.0 Other Bank Customers may Also Benefit
x

SBI: ఖాతాదారులకి గుడ్‌న్యూస్‌.. త్వరలో మరో కొత్త సేవని ప్రారంభించనున్న ఎస్బీఐ..!

Highlights

SBI: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్వరలో గూగుల్ తరహాలో అనేక ఫీచర్లతో YONO 2.0ని ప్రారంభించబోతోంది.

SBI: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్వరలో గూగుల్ తరహాలో అనేక ఫీచర్లతో YONO 2.0ని ప్రారంభించబోతోంది. SBI కస్టమర్లు కాని వారు కూడా ఈ యాప్‌ ప్రయోజనం పొందుతారు. అంటే భారతీయులందరూ YONO 2.0 సేవను పొందవచ్చు. వాస్తవానికి SBI డిజిటల్ బ్యాంకింగ్ కోసం YONO యాప్‌ను ప్రారంభించింది. కస్టమర్స్ ఈ యాప్‌లో డిజిటల్ బ్యాంకింగ్‌తో సహా ఈ -కామర్స్ సేవ సౌకర్యాన్ని పొందుతారు.

SBI కస్టమర్ల ప్రయోజనాల కోసం YONO యాప్ 16 మార్చి 2019న ప్రారంభించారు. యాప్‌తో పాటు ఆన్‌లైన్ పోర్టల్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. యోనో క్యాష్ దీని అతిపెద్ద ఫీచర్. ఇందులో వినియోగదారులకు అనేక సౌకర్యాలు లభిస్తాయి. ఇది ఏదైనా SBI ATM, SBI మర్చంట్, POS టెర్మినల్స్, కస్టమర్ సర్వీస్ పాయింట్ల (CSPలు) నుంచి తక్షణమే డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతిస్తుంది. దీంతో పాటు మీరు ఈ యాప్‌లో SBIకి సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని పొందుతారు.

YONO యాప్‌లో కస్టమర్లు అనేక సౌకర్యాలను పొందుతారు. ATMలు, POS టెర్మినల్స్ లేదా CSPల నుంచి నగదు ఉపసంహరించుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఏటీఎమ్‌ కార్డ్‌ మెయంటెన్‌ చేయనవసరం లేదు. ఇది సురక్షితమైనది. కార్డ్‌తో సంబంధం ఉన్న అన్ని ప్రమాదాలను తొలగిస్తుంది. SBI YONO యాప్‌‌తో పాటు వెబ్‌సైట్ కూడా ఉంది. ఈ ప్లాట్‌ఫామ్స్‌పై బ్యాంకింగ్ సేవలు, ఇన్వెస్టింగ్, ఇన్స్యూరెన్స్... ఇలా అనేక రకాల సేవలు ఉపయోగించుకోవచ్చు.

అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రారంభించడం,బెనిఫీషియరీని యాడ్ చేయడం లాంటివి యోనో యాప్‌తో సాధ్యం. ఇందుకోసం మీరు ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్‌ లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్‌‌ సేవల్ని SBI YONO యాప్‌‌లో పొందొచ్చు. చెక్ బుక్, డెబిట్ కార్డ్ రిక్వెస్ట్ చేయడం, ఏటీఎం పిన్ జెనరేట్ చేయడం, డెబిట్ కార్డ్ బ్లాక్ చేయడం కూడా యోనో యాప్‌తో సాధ్యం.

Show Full Article
Print Article
Next Story
More Stories