SBI: బైక్‌ కొనాలని ఆలోచిస్తున్నారా.. ఎస్‌బీఐ సూపర్ ఆఫర్..

SBI Offers Low Interest Bike Loans to Its Customers
x

SBI: బైక్‌ కొనాలని ఆలోచిస్తున్నారా.. ఎస్‌బీఐ సూపర్ ఆఫర్..

Highlights

SBI: బైక్‌ కొనడానికి లోన్‌ కావాలా.. అయితే ఎస్బీఐ బంపర్ ఆఫర్‌ని ప్రకటించింది. తక్కువ వడ్డీకే మీ కలని సాకారం చేసుకోవచ్చు.

SBI: బైక్‌ కొనడానికి లోన్‌ కావాలా.. అయితే ఎస్బీఐ బంపర్ ఆఫర్‌ని ప్రకటించింది. తక్కువ వడ్డీకే మీ కలని సాకారం చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక ద్విచక్ర వాహన రుణం పేరు SBI ఈజీ రైడ్. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ప్రత్యేక రుణ ఆఫర్ అందరికి ఇవ్వడం లేదు. ఎంపిక చేసిన వ్యక్తులకు మాత్రమే ఆఫర్ చేస్తుంది. అందులో మీరు కచ్చితంగా ఎస్బీఐ కస్టమర్ అయి ఉండాలి. YONO మొబైల్ యాప్‌ని ఉపయోగించడం ద్వారా నిమిషాల వ్యవధిలో ఈ లోన్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.

ఈజీ రైడ్ లోన్ ఆఫర్ కింద రూ.20 వేల నుంచి రూ.3 లక్షల వరకు రుణం అందిస్తుంది. దీనికి గరిష్టంగా 48 నెలలు అంటే 4 ఏళ్లు ఇస్తారు. ఈజీ రైడ్ టూ-వీలర్ లోన్ ప్రారంభ వడ్డీ రేటు 9.35 శాతంగా ఉంటుంది. కస్టమర్ లోన్ అర్హతను బట్టి బైక్ ఆన్-రోడ్ ధరలో 85% వరకు లోన్ పొందుతారు. YONO మొబైల్ యాప్ ద్వారా ఎప్పుడైనా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం మీరు బ్యాంకు శాఖకు కూడా వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ప్రీ-అప్రూవ్డ్ టూ వీలర్ లోన్ ఆఫర్ కింద లోన్ మొత్తం వెంటనే డీలర్ ఖాతాలో జమ అవుతుంది. మార్చి 31, 2022లోపు రుణం తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉండదు.

అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 1 నుంచి 'తక్షణ చెల్లింపు సేవ' లేదా IMPS ఛార్జీని పెంచుతోంది. బ్యాంక్ బ్రాంచ్‌లో IMPS ద్వారా చేసే నగదు బదిలీకి ఎక్కువ ఛార్జీ విధిస్తుంది. IMPS ద్వారా 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు పంపితే ఇప్పుడు 20 రూపాయలు కలిపి GST చెల్లించాల్సి ఉంటుంది. IMPS అనేది ఒక ప్రముఖ చెల్లింపు సేవ. ఇందులో నిధులు ఒక బ్యాంకు ఖాతా నుంచి మరొక బ్యాంకు ఖాతాకు సెకన్లలో బదిలీ అవుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories