SBI బంపరాఫర్.. చౌక ధరకే ఇల్లు, ప్లాట్స్ కొనేయండి.. 2 రోజులే ఆఫర్!

SBI బంపరాఫర్.. చౌక ధరకే ఇల్లు, ప్లాట్స్ కొనేయండి.. 2 రోజులే ఆఫర్!
x
Highlights

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు భారీ ఆఫర్ ను అందుబాటులో ఉంచింది. ఇల్లు, ప్లాట్, షాప్ వంటివి ఆఫర్ చేస్తోంది..

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు భారీ ఆఫర్ ను అందుబాటులో ఉంచింది. ఇల్లు, ప్లాట్, షాప్ వంటివి ఆఫర్ చేస్తోంది. వీటిని అతి తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. మెగా ఈవేలం నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని వాటిని సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఎస్‌బీఐ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. ఎస్‌బీఐ మెగా ఈవేలం సెప్టెంబర్ 30న జరుగుతుందని.. ఈవేలంలో 1000కి పైగా ప్రాపర్టీలను విక్రయిస్తున్నట్టు పేర్కొంది. హౌసింగ్ లేదా రెసిడెన్షియల్ ప్రాపర్టీ, ప్లాట్స్, షాప్స్ వంటివి ఎస్‌బీఐ ఆఫర్ చేస్తున్న వాటిలో ఉన్నాయి.బ్యాంక్ లోన్ తీసుకొని తిరిగి చెల్లించలేకపోయినా వారి నుంచి ఈ ప్రాపర్టీస్ తీసుకొని బ్యాంక్ ఆన్‌లైన్‌లో విక్రయించనుంది. మెగా ఈ-వేలానికి సంబంధించిన అన్ని వివరాలు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.. sbi.co.in. ఆన్‌లైన్‌లో లేదా సమీప ఎస్‌బిఐ శాఖకు వెళ్లడం ద్వారా బిడ్ చేయవచ్చు.

SBI - sbi.co.in అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, మెగా ఈ-వేలంలో వివరాలు ఇలా ఉన్నాయి.. వేలంలో పాల్గొనేందుకు బిడ్ వేయొచ్చు. వేలంలో పాల్గొనాలని భావించే వారు ముందుగానే కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. అలాగే కేవైసీ డాక్యుమెంట్లను దగ్గరిలోని ఎస్‌బీఐ బ్రాంచులో అందించాలి. లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్- ఇఎమ్‌డి డిపాజిట్ చేసిన తరువాత మరియు సంబంధిత శాఖకు కెవైసి పత్రాలను సమర్పించిన తరువాత ఈ-వేలం వేసేవారు బిడ్డర్ల వివరాలు ఇమెయిల్ ఐడికి వస్తాయి. లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ సాయంతో మీరు కూడా ఈ-వేలంలో పాల్గొనవచ్చు. మార్కెట్ ధరల కన్నా తక్కువ రేటుకే వేలంలో పాల్గొన్ని ప్రాపర్టీస్‌ను సొంతం చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories