SBI: ఎస్బీఐ ఖాతాదారులు అలర్ట్‌.. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోండి..!

SBI Clients Alert‌ do not Share OTP With Anyone
x

SBI: ఎస్బీఐ ఖాతాదారులు అలర్ట్‌.. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోండి..!

Highlights

SBI: నేటి ఆన్‌లైన్ యుగంలో బ్యాంకింగ్ రంగం కూడా మొబైల్‌పైనే ఆధారపడుతోంది.

SBI: నేటి ఆన్‌లైన్ యుగంలో బ్యాంకింగ్ రంగం కూడా మొబైల్‌పైనే ఆధారపడుతోంది. ఏ లావాదేవీ అయినా (మనీ ట్రాన్స్‌ఫర్) అయినా ఇంట్లో కూర్చొని సులువుగా చేస్తున్నారు. కానీ సైబర్‌ మోసాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండటం అవసరం. చాలా మంది మోసగాళ్లు బ్యాంకర్లుగా నటిస్తూ కస్టమర్లకు ఫోన్ చేస్తున్నారు. తర్వాత ఆకర్షనణీయమైన ఆఫర్లు ఉన్నాయంటు చెబుతూ OTP మొదలైనవి అడుగుతున్నారు. అంతే ఇంకేముంది ఖాతా నుంచి డబ్బులు కట్‌ అయినట్లు మొబైల్‌కి మెస్సేజ్‌ వస్తుంది. ఇలాంటి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కోట్లాది మంది ఖాతాదారులను అప్రమత్తం చేసింది.

తాజాగా ఓ ట్వీట్‌ కూడా చేసింది. దీంతో కోట్లాది మంది ఖాతాదారులను బ్యాంకు హెచ్చరించింది. SBI అధికారిక ట్విటర్ హ్యాండిల్ ట్వీట్ చేస్తూ 'బ్యాంకు OTP ఎవ్వరితో షేర్‌ చేసుకోకూడదని తెలిపింది' SBI దేశంలోనే అతి పెద్ద బ్యాంకు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 45 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు.అలాగే సైబర్ నేరగాళ్లు MMSని కస్టమర్‌లకు పంపుతారు ప్రియమైన కస్టమర్, మీ SBI పత్రాల గడువు ముగిసింది. మీ ఖాతా 24 గంటల్లో బ్లాక్ చేయబడుతుంది. మీ KYC- http://ibit.ly/oMwK అప్‌లోడ్ చేయడానికి దయచేసి ఈ లింక్‌పై క్లిక్ చేయండి. అని చెబుతారు. కానీ బ్యాంక్ ఎప్పటికీ ఈ విధంగా అడగదని SBI తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories