SBI: ఎస్బీఐ బంపర్ ఆఫర్.. నెలకి రూ.80 వేలు సంపాదించే అవకాశం..!

SBI ATM Franchise Offer Easy Way to Earn Rs 80 Thousand Per Month
x

SBI:ఎస్బీఐ బంపర్ ఆఫర్.. నెలకి రూ.80 వేలు సంపాదించే అవకాశం..!

Highlights

SBI: మీరు ఇంట్లో కూర్చొని పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలంటే ఎస్బీఐ సూపర్ ఆఫర్ అందిస్తుంది.

SBI: మీరు ఇంట్లో కూర్చొని పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలంటే ఎస్బీఐ సూపర్ ఆఫర్ అందిస్తుంది. నెలకు 80 వేల నుంచి 90 వేల రూపాయలు సులభంగా సంపాదించగల గొప్ప వ్యాపార ఆలోచనను మీ ముందుంచింది. అంతేకాదు ఇది చాలా సురక్షితమైన వ్యాపారం. ఎటువంటి మోసం ఉండదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ATM ఫ్రాంచైజీని తీసుకోవడం ద్వారా మీరు సులభంగా సంపాదించవచ్చు. అయితే బ్యాంకు తరపున ఏ బ్యాంకు ATM ఇన్‌స్టాల్ చేయదు. కానీ దాని కోసం ప్రత్యేక సంస్థలు ఉంటాయి. బ్యాంకు ప్రతిచోట తన ఏటీఎంని ఇన్‌స్టాల్ చేసే కాంట్రాక్ట్‌ని ఒక ప్రత్యేక సంస్థకి ఇస్తుంది. కాబట్టి మీరు ఏటీఎం ఫ్రాంచైజీ తీసుకోవడం ద్వారా పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

SBI ATM ఫ్రాంచైజీని తీసుకోవడానికి షరతులు

1.SBI ATM ఫ్రాంచైజీని తీసుకోవడానికి మీకు 50 నుంచి 80 చదరపు అడుగుల స్థలం ఉండాలి.

2. ఇతర ATMల నుంచి 100 మీటర్ల దూరం ఉండాలి.

3. స్థలం మెయిన్ సెంటర్‌లో ఉండాలి.

4. 24 గంటల విద్యుత్ సరఫరా ఉండాలి. 1 kW విద్యుత్ కనెక్షన్ తప్పనిసరి.

5. ఈ ATM రోజుకు దాదాపు 300 లావాదేవీల సామర్థ్యం కలిగి ఉండాలి.

6.ATM స్థలంలో కాంక్రీట్ పైకప్పు ఉండాలి.

SBI ATM ఫ్రాంచైజీకి అవసరమైన పత్రాలు

1.ID ప్రూఫ్ - ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్

2. అడ్రస్ ప్రూఫ్ - రేషన్ కార్డ్, ఎలక్ట్రిసిటీ బిల్లు

3. బ్యాంక్ ఖాతా, పాస్‌బుక్

4. ఫోటోగ్రాఫ్, ఈ-మెయిల్ ID, ఫోన్ నంబర్

5. ఇతర పత్రాలు

6.GST నంబర్

7. అవసరమైన ఆర్థిక పత్రాలు

SBI ATM ఫ్రాంచైజీ కోసం ఎలా దరఖాస్తు చేయాలి..?

SBI ATM ఫ్రాంచైజింగ్‌ను అందించే కంపెనీల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. టాటా ఇండిక్యాష్, ముత్తూట్ ATM, ఇండియా వన్ ATMలు భారతదేశంలో ATMలను ఇన్‌స్టాల్ చేయడానికి ఒప్పందాలను కలిగి ఉన్నాయి. దీని కోసం మీరు ఆన్‌లైన్‌లో సంప్రదించి ATM కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంత సంపాదించవచ్చు..

ఈ కంపెనీలలో టాటా ఇండిక్యాష్ అతిపెద్ద కంపెనీ. ఇది 2 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌పై ఫ్రాంఛైజీలను అందిస్తుంది. ఈ డబ్బులు తిరిగి చెల్లిస్తాయి. ఇది కాకుండా మీరు వర్కింగ్ క్యాపిటల్‌గా రూ.3 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇందులో మొత్తం పెట్టుబడి రూ. 5 లక్షలు. ఇందులో సంపాదనను పరిశీలిస్తే ప్రతి నగదు లావాదేవీపై రూ.8, నగదురహిత లావాదేవీపై రూ.2 లభిస్తాయి. అంటే వార్షిక ప్రాతిపదికన పెట్టుబడిపై రాబడి 33 నుంచి 50 శాతం వరకు ఉంటుంది. అంటే ఉదాహరణకి మీ ATM ద్వారా ప్రతిరోజూ 250 లావాదేవీలు జరిగితే అందులో 65 శాతం నగదు లావాదేవీలు, 35 శాతం నగదు రహిత లావాదేవీలు అయితే మీ నెలవారీ ఆదాయం దాదాపు 45 వేల రూపాయల వరకు ఉంటుంది. అదే సమయంలో 500 లావాదేవీలపై సుమారు 88 నుంచి 90 వేల కమిషన్ ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories