SBI Alert: ఎస్బీఐ అలర్ట్.. ఈ విషయాలని అస్సలు విస్మరించవద్దు..!
SBI Alert: టెక్నాలజీ పెరగడంతో సైబర్ నేరస్థులు చేతివాటం చూపిస్తున్నారు.
SBI Alert: టెక్నాలజీ పెరగడంతో సైబర్ నేరస్థులు చేతివాటం చూపిస్తున్నారు. రకరకాల పద్దతులలో జనాలని మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ విషయాలలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికింద ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం అనంతరం అకౌంట్‌లో ఉన్న సొమ్ము మొత్తం కాజేయడం జరుగుతుంది. అందుకే ఎస్బీఐ తన ఖాతాదారులని ఆన్‌లైన్ బ్యాంకింగ్ విషయంలో హెచ్చరిస్తోంది.
రాంగ్ నంబర్ నుంచి వచ్చే మెస్సేజ్‌లని, ఫోన్ కాల్స్‌ని జాగ్రత్తగా పరిశీలించమని అలర్ట్ చేసింది. ఇందుకోసం ట్విట్టర్ ద్వారా ఓ వీడియోని కూడా విడుదల చేసింది. ఫేక్ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ప్రజలు ఎలా మోసపోతున్నారో తెలియజేసింది. ఏదైనా నకిలీ మెస్సేజ్ వచ్చినప్పుడు, ఫోన్‌కాల్స్ వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. వాటికి తిరిగి రిప్లై ఇవ్వకూడదు.
ఇది కాకుండా ఎవరైనా తెలియని నెంబర్‌తో మెస్సేజ్ చేసి లేదా ఫోన్‌కాల్స్ చేసి చెల్లింపులు చేయమని అడిగితే పట్టించుకోవద్దు. అంతేకాదు ఆ నెంబర్ నుంచి వచ్చిన మెస్సేజ్‌లో స్పెల్లింగ్ మిస్టెక్స్ ఉంటాయి గమనించండి. వెంటనే ఇది రాంగ్ నంబర్ అని తెలిసిపోతుంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు తెలియకుండా సమాచారం అందిస్తారు. అందుకే వారికి ఈ విషయాలపై అవగాహన కల్పించాలి.
Understand "YehWrongNumberHai"! Never call back or respond to such SMSs as these are scam to steal your personal/financial information. Stay Alert and #SafeWithSBI. #CyberJagrooktaDiwas#SBI #AmritMahotsav pic.twitter.com/5eHwDhh1yF
— State Bank of India (@TheOfficialSBI) October 5, 2022
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire