ఎస్బీఐ రిటైర్డ్‌ ఉద్యోగులకి బంపర్ ఆఫర్.. నెలకి రూ.40 వేలు సంపాదించే అవకాశం..!

SBI 1438 Collection Facilitators Recruitment Check for All Details
x

ఎస్బీఐ రిటైర్డ్‌ ఉద్యోగులకి బంపర్ ఆఫర్.. నెలకి రూ.40 వేలు సంపాదించే అవకాశం..!

Highlights

SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1438 కలెక్షన్ ఫెసిలిటేటర్ల రిక్రూట్‌మెంట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.

SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1438 కలెక్షన్ ఫెసిలిటేటర్ల రిక్రూట్‌మెంట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. డిసెంబర్ 22 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హతగల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ sbi.co.inని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. జనవరి 10, 2023లోపు అప్లై చేసుకోవాలి. ఎంపికైన తర్వాత అధికారి బ్యాంక్ క్రెడిట్ మానిటరింగ్ విభాగంలో పని చేస్తారు.

విద్యార్హత

దరఖాస్తుదారులు 60 ఏళ్ల తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా SBIలో అసోసియేట్ బ్యాంక్‌ల రిటైర్డ్ ఆఫీసర్ అయి ఉండాలి. SBI రిటైర్డ్ ఆఫీసర్లకు తప్ప వారికి నిర్దిష్ట విద్యార్హత లేదు. అభ్యర్థుల వయస్సు 65 ఏళ్లు మించకూడదు.

ఎలా దరఖాస్తు చేయాలి..?

1. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు SBI bank.sbi/careers, sbi.co.in/careers అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

2. వెబ్‌సైట్‌లో మీ పేరు నమోదు చేసుకోవాలి. అలాగే మీ లాగిన్ వివరాలను సృష్టించాలి.

3. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ వివరాలతో లాగిన్ అవ్వాలి. తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు.

4. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌ను నింపిన తర్వాత సమర్పించాలి. దాని ప్రింట్ అవుట్ తీసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

షార్ట్‌లిస్టింగ్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన షార్ట్‌లిస్టింగ్ కమిటీ షార్ట్‌లిస్టింగ్ నిబంధనలని అనుసరించి లిస్టు తయారుచేస్తుంది. ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూ రౌండ్‌కు పిలుస్తారు. తర్వాత SBI ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు సాధారణ కట్-ఆఫ్ నంబర్‌ను పొందినట్లయితే, వారి మెరిట్ వయస్సు ప్రకారం ఉద్యోగం కేటాయిస్తారు. జీతం గురించి చెప్పాలంటే నెలకు రూ. 25,000 నుంచి రూ. 40,000 వరకు పొందుతారు. ఒక్కో పోస్టుకు వేతనాలు వేర్వేరుగా ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories