Saving Schemes: ఐదేళ్లలో రూ. 21 లక్షలు.. పోస్టాఫీస్‌లో అదిరిపోయే పథకం..!

Saving Schemes: ఐదేళ్లలో రూ. 21 లక్షలు.. పోస్టాఫీస్‌లో అదిరిపోయే పథకం..!
x

Saving Schemes: ఐదేళ్లలో రూ. 21 లక్షలు.. పోస్టాఫీస్‌లో అదిరిపోయే పథకం..!

Highlights

Saving Schemes: భవిష్యత్తు ఆర్థిక అవసరాల దృష్ట్యా డబ్బును పొదుపు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

Saving Schemes: భవిష్యత్తు ఆర్థిక అవసరాల దృష్ట్యా డబ్బును పొదుపు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం మారుతోన్న ఆర్థిక అవసరాలు, పెరుగుతోన్న ఖర్చులతో చాలా మంది రకరకాల పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే కష్టపడి సంపాదించిన డబ్బుకు సెక్యూరిటీతో పాటు, మంచి రిటర్న్స్‌ రావాలని చాలా మంది ఆశపడుతుంటారు. అలాంటి వారికోసమే కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్‌ రకరకాల పథకాలను తీసుకొచ్చింది. ఇలాంటి పథకాల్లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ ఒకటి. మరి ఈ స్కీమ్‌ ద్వారా ఐదేళ్లలో రూ. 24 లక్షలు ఎలా సంపాదించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టాఫీస్‌ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ పథకం లాంటిది. ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి డబ్బుకు సెక్యూరిటీతో పాటు మంచి రిటర్న్స్‌ సైతం పొందొచ్చు. ప్రస్తుతం పోస్టాఫీసు ఆర్‌డీ వడ్డీ రేటు సంవత్సరానికి 6.70% గా నిర్ణయించారు. బ్యాంక్ రికరింగ్ డిపాజిట్ల మాదిరిగా కాకుండా, పోస్టాఫీసు ఆర్డీలు ఐదు సంవత్సరాల కాల వ్యవధిని కలిగి ఉంటాయి. మెచ్యూరిటీ సమయానికి మీరు పెట్టుబడికి వడ్డీతో కలిపి రిటర్న్స్‌ పొందొచ్చు.

అయితే ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన వారు ఒకవేళ ఖాతాను పొడగించుకోవాలనుకుంటే మరో 5 ఏళ్లు పొడగించుకోవచ్చు. దీంతో మొత్తం వ్యవధిని 10 ఏళ్లకు పెంచుకునే వెసులుబాటును కల్పించారు. ఇక ఈ పథకంలో కనిష్ట పెట్టుబడి రూ. 10కాగా గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఐదేళ్లకు రూ. 21 లక్షలు పొందాలనుకుంటే నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం నెలకు రూ. 30,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీంతో మీరు ఐదేళ్లలో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం రూ. 18,00000 అవుతుంది. అయితే దీనికి రూ. 3,40,974 వడ్డీ లభిస్తుంది. దీంతో ఐదేళ్లకు మొత్తం రూ. 21,40,074 పొందుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories