ఈ ప్రభుత్వ స్కీంలో నెలకి రూ.3000 పొదుపు చేస్తే తర్వాత రూ.44 లక్షలు మీవే..!

Save Rs.3000 per Month in National Pension Scheme Then Earn Rs.44 Lakhs
x

ఈ ప్రభుత్వ స్కీంలో నెలకి రూ.3000 పొదుపు చేస్తే తర్వాత రూ.44 లక్షలు మీవే..!

Highlights

Pension Scheme: ఈ రోజుల్లో పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజల జీవన వ్యయం అస్తవ్యస్తంగా మారింది.

Pension Scheme: ఈ రోజుల్లో పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజల జీవన వ్యయం అస్తవ్యస్తంగా మారింది. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నందున ఇంటి బడ్జెట్‌ను నియంత్రించడం తలకిమించిన భారమవుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భవిష్యత్తు గురించి ముఖ్యంగా రిటైర్మెంట్‌ తర్వాత జీవితం గురించి కచ్చితంగా ఆలోచన చేయాల్సిందే.

ద్రవ్యోల్బణాన్ని అధిగమించి కొన్ని సంవత్సరాలలో మిమ్మల్ని మిలియనీర్‌గా మార్చే ఒక ప్రభుత్వ స్కీం ఉంది. దానిపేరు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS). రిటైర్మెంట్‌ తర్వాత పౌరులకు ఆర్థిక భద్రతను అందించడానికి ప్రభుత్వం రూపొందించిన పథకమే ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఇది మొదట్లో ప్రభుత్వ రిటైర్మెంట్‌ పథకం కానీ తర్వాత ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి అందుబాటులోకి వచ్చింది. పెన్షన్ ఫండ్‌లో జమ చేసిన డబ్బును 60 ఏళ్లు పైబడిన ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.

ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టడానికి కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. కనీసం రూ.500 ప్రారంభ పెట్టుబడి ఉన్న ఏ భారతీయ పౌరుడైనా ఇందులో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఎన్పీఎస్‌లో రెండు రకాల ఖాతాలుంటాయి ఒకటి టైర్ 1 మరొకటి టైర్ 2 ఈ రెండింటిలో ఎందులోనైనా పెట్టుబడి పెట్టవచ్చు. NPS పొదుపును నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెన్షన్ ఫండ్ నిర్వాహకులు స్టాక్‌లు, వ్యాపారాల నుంచి బాండ్‌లు, ప్రభుత్వ ఆస్తులలో పెట్టుబడి పెడతారు. రిటైర్మెంట్‌ కోసం NPS ఒక గొప్ప పథకం. ఎందుకంటే ఇది ద్రవ్యోల్బణం రేటు కంటే మెరుగైన రాబడిని అందిస్తుంది.

ఇలా లెక్కించండి

మీ వయస్సు 34 ఏళ్లు అయితే మీరు ఈ పథకంలో నెలకు రూ.3000 ఇన్వెస్ట్ చేయాలి. ఇలా 26 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. అప్పుడు మీరు పెట్టిన మొత్తం పెట్టుబడి రూ.9.36 లక్షలు అవుతుంది. NPSని లెక్కించిన తర్వాత మీరు మెచ్యూరిటీపై రూ.44.35 లక్షలు పొందుతారు. ఇంత మొత్తం దాదాపు ఏ పథకంలో పొందలేరు. అందుకే ఈరోజే ఈ స్కీంలో చందాదారులుగా చేరండి.

Show Full Article
Print Article
Next Story
More Stories