Samsung: భారత మార్కెట్లోకి కోటి రుపాయల శాంసంగ్‌ టీవీ

Samsung introduces India to a TV with over ₹1 crore price tag
x

Samsung: భారత మార్కెట్లోకి కోటి రుపాయల శాంసంగ్‌ టీవీ

Highlights

Samsung: 110 అంగుళాల 4కే డిస్‌ప్లేతో లాంచ్‌

Samsung: శాంసంగ్‌ తాజాగా లగ్జరీ టీవీని భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. ఏకంగా 110 అంగుళాల 4కే డిస్‌ప్లేతో ఈ సరికొత్త టీవీని తీసుకొచ్చింది. M1 AI ప్రాసెసర్‌తో టీవీని తయారు చేశారు. సఫైర్‌ గ్లాస్‌తో ఈ స్క్రీన్‌ను తయారు చేశారు. డాల్బీ అట్మాస్‌, మొబైల్ మిర్రరింగ్, వైఫై కనెక్టివిటీ వంటి ఫీచర్లు కొత్త టీవీలో ఉన్నాయి.

110 అంగుళాల స్క్రీన్‌తో వస్తున్న ఈ శాంసంగ్‌ టీవీ ధర కోటి 14 లక్షల 99వేలుగా కంపెనీ నిర్ణయించింది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. సఫైర్‌ గ్లాస్‌తో తయారు చేసిన 24.8 మిలియన్‌ మైక్రో ఎల్‌ఈడీలు ఇందులో అమర్చారు. దీంతో శక్తిమంతమైన రంగులను సైతం కంటికి ఇంపుగా మార్చగలదు. మైక్రో హెచ్‌డీఆర్‌, మల్టీ ఇంటెలిజెన్స్ AI అప్‌స్కేలింగ్, సీన్ అడాప్టివ్ కాంట్రాస్ట్, డైనమిక్ రేంజ్ ఎక్స్‌పాన్షన్+ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మైక్రో ఎల్‌ఈడీ టీవీ మల్టీ వ్యూ ఫీచర్‌నూ అందిస్తుంది. ఈ ఫీచర్ సాయంతో నాలుగు వేర్వేరు సోర్సుల నుంచి కంటెంట్‌ను వీక్షించవచ్చు.. మినిమలిస్టిక్ మోనోలిత్ డిజైన్‌తో టీవీ ఉంటుంది. ఇందులో ప్రత్యేకంగా అమర్చిన ఆర్ట్‌ మోడ్‌, యాంబియంట్‌ మోడ్‌+ సాయంతో టీవీని ఆర్ట్‌ డిస్‌ప్లే వాల్‌గా మార్చుకోవచ్చు. మెరుగైన ఆడియో 100W RMS సౌండ్‌ సిస్టంను ఇందులో అమర్చారు. టీవీకి సోలార్‌ సెల్ రిమోట్‌ ఇచ్చారు. దీన్ని ఇండోర్‌ లైట్‌ సాయంతో ఛార్జ్‌ చేయొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories