Salary Hikes: ఐటీ ఉద్యోగులకు మళ్లీ నిరాశే..ఈ ఏడాది వేతనాలు పెరుగుదల సింగిల్ డిజిటే

Salary growth for IT employees this year is single digit
x

Salary Hikes: ఐటీ ఉద్యోగులకు మళ్లీ నిరాశే..ఈ ఏడాది వేతనాలు పెరుగుదల సింగిల్ డిజిటే

Highlights

Salary Hikes:సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు గతేడాది ఆర్థిక సంవత్సరం నిరాశే మిగుల్చింది. అంతకుముందు రెండు ఆర్థిక సంవత్సరాలు సిబ్బంది జీతాలు రెండెంకలు వరకు పెంచాయి ప్రధాన ఐటీ రంగ సంస్థలు.

Salary Hikes:సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు గతేడాది నిరాశే మిగిలింది. అంతకుముందు రెండు ఆర్థిక సంవత్సరాలు సిబ్బంది జీతాలు రెండకంల స్థాయి వ్రుద్ధిలో పెంచిన ప్రధాన ఐటీ రంగ సంస్థలు..గత ఆర్థిక ఏడాది మాత్రం సింగిల్ డిజిట్ కే పరిమితం చేశాయి. దేశంలోని టాప్ 5 ఐటీ కంపెనీల్లో సవాళ్లను ఎదుర్కొనేందుకు నియంత్రణ చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆయా సంస్థలకు ఖర్చు కట్టడి కూడా తప్పడం లేదు. దీనిలో భాగంగానే ఉద్యోగులకు వార్షిక వేతనాలు పెంపులో కోతపెడుతున్నాయి. దీంతో మెజార్టీ ఐటీ ఉద్యోగులకు ఈ ఏడాది మార్చి చివరితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 5శాతం నుంచి 9శాతం మేరకే సాలరీల్లో ఇంక్రిమెంట్లు దక్కాయి.

ఇక దేశీయ ఐటీ దిగ్గజ సంస్థల్లో పెద్ద సంస్థ అయిన ఇన్ఫోసిస్ లో గత ఆర్ధిక సంవత్సరం ఉద్యోగుల జీతాలు సగటున 9శాతమే పెరిగాయి. ఐటీ రంగ దిగ్గజం టీసీఎస్ లో అయితే 7 నుంచి 9శాతం పెరిగాయి. విప్రో లో 9.4శాతం ఉంటే టెక్ మహీంద్రాలో 5.6శాతం ఉన్నాయి. కోవిడ్ ప్రభావం ఉన్నప్పటికీ 2021-22లో టీసీఎస్, ఇన్ఫొసిస్, విప్రో కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలు రెండెంకలు పెంచాయి. టెక్ మహీంద్రా 5.2శాతం పెంచితే హెచ్ సీఎల్ 6.8శాతంతోనే సరిపెట్టుకున్నాయి.

భారీ సంఖ్యలో ఉద్యోగులు, పెరుగుతున్న వ్యాపార ఖర్చులు, భారతీయ ఐటీ రంగాన్ని కుదేలు చేస్తున్నట్లు రిక్రూట్ మెంట్ కన్సల్టెన్సీ విషెల్ పేజ్ ప్రతినిధి ప్రన్షు ఉపాధ్యాయ్ తెలిపారు. సంస్థాగత ఆదాయం, లాభాలు తగ్గడంతో దానికి తగ్గట్లుగానే పొదుపు మంత్రం జపిస్తున్నాయన్నారు. ప్రవేశ స్థాయిలో ప్రతిభ,నైపుణ్యం కలిగిన ఉద్యోగుల లభ్యత లేకపోవడంతో కూడా సమస్య తలెత్తిందన్నారు. స్కిల్స్ ఉన్న ఉద్యోగులకు 12 నుంచి 15శాతం సగటున సాలరీలు పెరుగుతున్నట్లు రాండ్ స్టడ్ డిజిటల్ ఇండియా ఎండీ మిలింద్ షా తెలిపారు.

అటు దేశ, విదేశాల్లో నెలకొన్న ఆర్థిక మందగమనం ఛాయలతో భారతీయ ఐటీ కంపెనీలకు మున్ముందు ఇబ్బందులు తప్పవని అభిప్రాయాలు ఇప్పుడు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా,యూరప్ వంటి దేశాల్లో ఆర్థిక సంక్షోభపు పరిస్థితులు, దేశీయ ఐటీ కంపెనీల ఆదాయానికి ఇప్పటికే గండి కొడుగున్నాయని గుర్తు చేస్తున్నారు. అందుకే ఉద్యోగులకు జీతాలు అంతంతమాత్రంగానే పెంపుదలను ఐటీ రంగ నిపుణులు ప్రస్తుత సరళిని విశ్లేషిస్తున్నారు. అగ్రదేశాల రక్షణాత్మక ధోరణులు, పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు కూడా ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితులు మారనట్లయితే ఐటీ ఒక్కటే కాదు మిగతా రంగాల మనుగడకు కూడా ముప్పే అంటూ హెచ్చరిస్తుందటం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories