వాహనదారులకి బ్యాడ్‌ న్యూస్.. ఇక ఆ సేవలకి ఎక్కువ చెల్లించాల్సిందే..!

rising third party motor insurance prices on new vehicles from April 1st
x

వాహనదారులకి బ్యాడ్‌ న్యూస్.. ఇక ఆ సేవలకి ఎక్కువ చెల్లించాల్సిందే..!

Highlights

వాహనదారులకి బ్యాడ్‌ న్యూస్.. ఇక ఆ సేవలకి ఎక్కువ చెల్లించాల్సిందే..!

Motor Insurance: మీరు కొత్త కారు లేదా బైక్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఈ వార్త మీకోసమే. ఏప్రిల్ 1 నుంచి మీరు కొత్త కారు-బైక్‌పై ఇన్సూరెన్స్‌ కోసం మరింత చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ కోసం 17 నుంచి 23 శాతం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఇన్సూరెన్స్‌ రెగ్యులేటర్ (IRDAI)తో సంప్రదించి FY 2022-23కి థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రతిపాదిత రేటును ప్రకటించింది. పరిశ్రమ నుంచి వచ్చిన సూచనలను అనుసరించి కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2022 నుంచి అమలవుతాయి.

మోటారు వాహన చట్టం ప్రకారం రోడ్డుపై తిరిగే ప్రతి వాహనానికి తప్పనిసరిగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ ఉండాలి. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. సెప్టెంబర్ 2018 నుంచి విక్రయించే ప్రతి కొత్త 4 వీలర్‌కు తప్పనిసరిగా 3 సంవత్సరాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌, 2 వీలర్‌కు 5 సంవత్సరాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ పరిస్థితిలో 1500 సీసీ వరకు వాహనం కొనుగోలు చేసే వారు థర్డ్ పార్టీ బీమా రూ.1200 కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. 150 సీసీ వరకు ఉన్న ద్విచక్ర వాహనానికి వినియోగదారుడు రూ.600 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ప్రైవేట్ కార్ల కోసం వాటి ఇంజన్ సామర్థ్యాన్ని బట్టి పెరుగుదల ₹7 నుంచి195, ద్విచక్ర వాహనాలకు ₹58 నుంచి ₹481 వరకు పెంపుదల ప్రతిపాదించారు. 75 నుంచి150 cc బైక్‌లకు ₹ 38 తగ్గింపు కూడా సూచించారు. వాణిజ్య వాహనాలపై స్వల్ప పెంపును ప్రతిపాదించారు. కరోనా మహమ్మారి తర్వాత ఇప్పటి వరకు ఇన్సూరెన్స్‌ రేట్లు మారలేదు. కానీ జూన్‌ 2019లో ప్రైవేట్ కార్లు, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య గూడ్స్ క్యారేజ్ వాహనాలు, ప్యాసింజర్ క్యారేజ్ వాహనాలతో సహా ఎలక్ట్రిక్ వాహనాలకు 15% తగ్గింపు ప్రతిపాదించారు. అలాగే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు 7.5% తగ్గింపును ప్రతిపాదించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories