RBI : వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం..వరుసగా తొమ్మిదోసారి మార్పు లేదు

RBI Keeps Repo Rate Unchanged at 6.5% for Eighth Time
x

 

Highlights

RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న రెపోరేట్ల నిర్ణయంతో రుణ గ్రహీతలు బేజారయ్యారు. ఆర్బిఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేడు మానిటరీ పాలసీ కమిటీ సమావేశాల అనంతరం కీలక ప్రకటన చేశారు. అందులో భాగంగా రెపోరేట్లను 6.50 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు.

RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న రెపోరేట్ల నిర్ణయంతో రుణ గ్రహీతలు బేజారయ్యారు. ఆర్బిఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేడు మానిటరీ పాలసీ కమిటీ సమావేశాల అనంతరం కీలక ప్రకటన చేశారు. అందులో భాగంగా రెపోరేట్లను 6.50 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు.పూర్తి వివరాల్లోకి వెళితే ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేడు ఎంపీసీ సమావేశాల అనంతరం కమిటీ నిర్ణయాలను గురువారం ప్రకటించారు. MPC రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ద్రవ్యోల్బణం 5 శాతం కంటే ఎక్కువగా ఉన్నందున, రెపో రేటును మార్చకూడదని MPCలోని సభ్యుల్లో 4:2 మెజారిటీ మంది నిర్ణయించారని దాస్ చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం దిగువకు తీసుకురావడమే మా లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు.

మూడో త్రైమాసికంలో దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనా

ఏప్రిల్, మే నెలల్లో ద్రవ్యోల్బణం 4.8 శాతంగా ఉందని, ఆహార ఉత్పత్తుల ధరల కారణంగా జూన్‌లో ద్రవ్యోల్బణం 5.1 శాతానికి తగ్గిందని ఆయన అన్నారు. ధరల స్థిరత్వం లేకుండా, వృద్ధి దీర్ఘకాలం కొనసాగదని ఆయన అభిప్రాయపడ్డారు. మూడో త్రైమాసికంలో దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. దేశీయ స్థాయిలో వృద్ధి కొనసాగిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

2024-25 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనా 4.5 శాతంగా నిర్ణయం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి రేటు అంచనాను 7.2 శాతంగా ఉంచింది. అదే సమయంలో, 2024-25 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం రేటు అంచనా 4.5 శాతంగా నిర్ణయించారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఎక్కువ డబ్బు అందుబాటులోకి రావాలి. మరిన్ని ఉద్యోగాలు సృష్టించవలసి వచ్చినప్పుడు ద్రవ్య విధానం వైఖరి అనుకూలమైనదిగా ఉంచబడుతుంది.

ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతోంది- గవర్నర్

దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతోందని గవర్నర్ అన్నారు. అయితే, మధ్య కాలంలో కొన్ని సవాళ్లు మిగిలి ఉన్నాయి. పెరుగుతున్న డిమాండ్ కారణంగా, దేశంలో తయారీ రంగం కార్యకలాపాలు పెరుగుతున్నాయన్నారను. ఆర్‌బిఐ చివరిసారిగా రెపో రేటును ఫిబ్రవరి 2023లో సవరించింది. అప్పట్లో రెపో రేటును 6.5 శాతానికి పెంచారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ఆర్బీఐ రెపోరేటును అప్పట్లో సవరించింది.

ఇదిలా ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేట్లను స్థిరంగా ఉంచడంతో బ్యాంకుల్లో రుణాల కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లు నిరాశలో కూరుకు పోతున్నారు. రెపోరేట్లు తగ్గినట్లయితే, పాము పొందే రుణాలపై వడ్డీ కూడా తగ్గుతుందని భావించారు. వారి ఆశలపై నిజరూ బ్యాంక్ ఆఫ్ ఇండియా నీళ్లు చల్లింది.

Show Full Article
Print Article
Next Story
More Stories