Paytm: పేటీఎంకి బ్యాంక్ హోదా ఇచ్చిన ఆర్బీఐ.. ప్రయోజనాలు ఏమిటీ..?

RBI has Given Bank Status to Paytm What are the Benefits | Business News
x

Paytm: పేటీఎంకి బ్యాంక్ హోదా ఇచ్చిన ఆర్బీఐ.. ప్రయోజనాలు ఏమిటీ..?

Highlights

Paytm: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కి షెడ్యూల్ పేమెంట్స్ బ్యాంక్ హోదాను కల్పించింది...

Paytm: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కి షెడ్యూల్ పేమెంట్స్ బ్యాంక్ హోదాను కల్పించింది. సీఎన్‌బీసీ ఆవాజ్ నివేదిక ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నారు. పేటీఎం షెడ్యూల్ పేమెంట్స్ బ్యాంక్ స్థితిని పొందిన తర్వాత కొత్త వ్యాపారంపై దృష్టి పెట్టవచ్చు.

ఈ వార్తల కారణంగా కంపెనీ షేర్లు కూడా భారీగా పెరిగాయి. పేటీఎం షెడ్యూల్ బ్యాంక్ హోదాను పొందుతుందనే వార్తలతో స్టాక్ మార్కెట్‌లో గొప్ప ప్రభావాన్ని చూపించింది. బీఎస్ఈలో పేటీఎం షేర్ 5.87 శాతం పెరిగి రూ.1,645కి చేరుకుంది.

షెడ్యూల్ బ్యాంక్‌గా మార్పు చెందితే ప్రయోజనం ఏమిటి?

నివేదిక ప్రకారం.. ఇప్పుడు ప్రభుత్వం, ఇతర పెద్ద సంస్థలు జారీ చేసే రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్స్ (RFP)లో పేటీఎం పాల్గొనచ్చు. ఇది కాకుండా ప్రాథమిక వేలంలో పాల్గొనవచ్చు. సెప్టెంబర్‌లోనే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుని అక్టోబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ విషయాన్ని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇప్పుడు ప్రకటించడం విశేషం. ఇది మాత్రమే కాదు పేటీఎం ఇప్పుడు ఫిక్స్‌డ్ రేట్, వేరియబుల్ రెపో రేట్, రివర్స్ రెపో రేట్‌లలో కూడా పాల్గొంటుంది. అంతేకాదు ప్రభుత్వం నిర్వహించే ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ స్కీమ్‌లలో భాగస్వామ్యానికి బ్యాంక్ అర్హత పొందుతుందని పేటీఎం తెలిపింది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ MD & CEO సతీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని రెండో షెడ్యూల్‌లో పేటీఎం చెల్లింపుల బ్యాంక్‌ను చేర్చడం వల్ల భారతదేశంలోని అణగారిన వర్గాలకు మరింత లాభం చేకూరనుంది. జనవరి 2017లో Paytm తన పేమెంట్స్ బ్యాంక్‌ని ప్రారంభించేందుకు RBI అనుమతిని పొందింది. కంపెనీ ప్రకటన ప్రకారం, మార్చి 31, 2021 నాటికి, పేమెంట్స్ బ్యాంక్ 6.4 కోట్ల పొదుపు ఖాతాలను కలిగి ఉంది. సేవింగ్స్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, భాగస్వామి బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, వాలెట్‌లలోని బ్యాలెన్స్‌లతో సహా రూ. 5200 కోట్లకు పైగా డిపాజిట్లను కలిగి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories