కొన్ని బ్యాంకుల్ని ప్రయివేట్ చేయండి.. మొండి బ్యాంక్ లు ఏర్పాటు చేయండి..ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్!

కొన్ని బ్యాంకుల్ని ప్రయివేట్ చేయండి.. మొండి బ్యాంక్ లు ఏర్పాటు చేయండి..ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్!
x
Highlights

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ బ్యాంకుల విషయంలో ప్రభుత్వానికి కొన్ని సూచనలను చేసారు. అంతే కాదు ఎంపిక చేసిన...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ బ్యాంకుల విషయంలో ప్రభుత్వానికి కొన్ని సూచనలను చేసారు. అంతే కాదు ఎంపిక చేసిన కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని, అలాగే మొండి బకాయిల సమస్యలను పరిష్కరించే విధంగా ఒక 'మొండి బ్యాంకు'ను సైతం ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. అంతే కాదు ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్యతో కలిసి 'ఇండియన్‌ బ్యాంక్స్‌: ఎ టైమ్‌ టు రిఫామ్‌' అనే చర్చాపత్రంలో సూచనలకూడా చేశారు.

అసలు ఆ సూచనలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం...

బ్యాంకింగ్‌ లైసెన్సులపై..

అధిక పనితీరు ప్రదర్శించే చిన్నచిన్న బ్యాంకులను ప్రమోట్ చేసి వాటిని పెద్ద బ్యాంకులుగా మార్చాలి. అదే సమయంలో పనితీరు సరిగా లేని కొన్ని పెద్ద బ్యాంకుల స్థాయిని తగ్గించి వాటిని చిన్న బ్యాంకులుగా మార్చాలి. అంతే కాకుండా బ్యాంకు లైసెన్సు దరఖాస్తులకు ఖాతాదారుల నుంచి ఎల్లపుడూ ఆహ్వానం పలకాలి. అలా చేసినప్పుడే మెరుగైన బ్యాంకులు ఆవిర్భవిస్తాయని తెలిపారు.

ఆర్థిక సేవల విభాగంపై..

ప్రైవేటు ఆస్తుల నిర్వహణ, జాతీయ ఆస్తుల నిర్వహణ కోసం సమాంతరంగా మొండి బ్యాంకులనూ ప్రోత్సాహించాలి. బ్యాంకు రుణాల విషయంలో ప్రభుత్వం ఆర్‌బీఐ నుంచి గొప్ప అధికారాన్ని పొందింది. ఆ అధికారాన్ని సార్లు పారిశ్రామికవేత్తలను నియంత్రణలోకి తెచ్చుకోవడానికి, ఒక్కోసారి ప్రజా లక్ష్యాలను చేరేందుకు, మరికొన్ని సార్లు ఆర్థిక సంఘటితానికి వినియోగించుకోవచ్చు. అంతే కాదు ఆర్థిక శాఖలో ఉన్నటువంటి ఆర్థిక సేవల విభాగ పాత్రను తగ్గించుకుంటూ పోవాలి. అలా చేసినపుడే బ్యాంకు యాజమాన్యానికి, బోర్డులకు స్వాతంత్య్రం లభిస్తుంది.

ప్రైవేటీకరణపై..

కార్పొరేట్‌ కంపెనీలకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాలు దక్కించుకోకుండా చూసి, ఆర్థిక- సాంకేతిక అనుభవం ఉన్న ప్రైవేటు పెట్టుబడుదార్లను ఎంపిక చేసి ఆహ్వానించాలి. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాలను తీసుకున్న ప్రభుత్వం తన వాటాను 50 శాతం కంటే దిగువకు తీసుకువస్తే ఆ బ్యాంకు కార్యకలాపాలకు, ప్రభుత్వానికి దూరం పెరుగుతుంది.

సంస్కరణలపై..

బ్యాంకు పాలన, యాజమాన్యం విషయాలతో పాటు నియంత్రణ, మార్కెట్‌ సంస్కరణలు జరగాలి. ఒత్తిడిలో ఉన్న కంపెనీకి అప్పులిచ్చిన రుణదాతలతో చర్చలు జరిపించాలి. ఆ చర్చలు కనుక విఫలం అయితే ఎన్‌సీఎల్‌టీకి వెళ్లాలి. మొండి బకాయిల విషయంలో కోర్టు బయటి పునర్నిర్మాణ అవకాశాలను పరిశీలించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories