ఈ బ్యాంకు ఖాతాదారులకి శుభవార్త.. సేవలు మరింత వేగం విస్తృతం

Punjab And Sind Bank To Double The Number Of ATM Network In Next Two Years
x

ఈ బ్యాంకు ఖాతాదారులకి శుభవార్త.. సేవలు మరింత వేగం విస్తృతం

Highlights

Punjab And Sind Bank: ఒక బ్యాంకుకి ఏటీఎం నెటవర్క్‌ సంఖ్య చాలా ముఖ్యం. ఇవి బ్యాంకు బిజినెస్‌ని ప్రభావితం చేస్తాయి.

Punjab And Sind Bank: ఒక బ్యాంకుకి ఏటీఎం నెటవర్క్‌ సంఖ్య చాలా ముఖ్యం. ఇవి బ్యాంకు బిజినెస్‌ని ప్రభావితం చేస్తాయి. వీటి ఆధారంగా వ్యాపారంలో హెచ్చు తగ్గులు వస్తాయి. మంచి ఏటీఎం నెట్‌వర్క్‌ ఉన్న బ్యాంకు బిజినెస్‌లో నెంబర్‌ స్థానానికి వెళుతుంది. అందుకే పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్ తన పరిధిని పెంచుకోవడానికి రాబోయే రెండేళ్లలో ఏటీఎం నెట్‌వర్క్ సంఖ్యను రెట్టింపు చేస్తుంది. ఖాతాదారులకి వేగంగా సేవలు అందించడానికి ఏటీఎం మిషన్‌లు బాగా ఉపయోగపడుతాయి. వీటివల్ల ప్రజలు తమ బ్యాంకు ఖాతా నుంచి ఎక్కడి నుంచైనా సులభంగా నగదు విత్‌ డ్రా చేసుకోవచ్చు.

పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్ వచ్చే రెండేళ్లలో ఏటీఎంల సంఖ్యని 1,600కిపెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ స్వరూప్ కుమార్ సాహా ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 50 శాఖలను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త బ్రాంచ్‌ల వల్ల తక్కువ ఖర్చుతో కూడిన డిపాజిట్లు పెరుగుతాయని చెప్పారు. రుణ ఉత్పత్తుల రంగంలోకి ప్రవేశించడంలో సహాయపడతాయని తెలిపారు.

ఇతర బ్యాంకుల ఖాతాదారులు ఏటీఎం మెషిన్‌ని ఉపయోగించడం వల్ల ఒక్కో లావాదేవీకి దాదాపు రూ.17 చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల ఏటీఎం నెట్‌వర్క్ దానంతట అదే లాభదాయకంగా మారుతుందని సాహా చెప్పారు. బ్యాంక్ తన 'కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్' (CBS) అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియలో ఉందని ఇది డిజిటల్ ప్రయాణాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories