ఈ పథకం కింద గ్యారెంటీ లేకుండా రుణాలు మంజూరు.. ఎవరు అర్హులంటే..?

Pradhan Mantri Svanidhi Yojana Scheme Check for all Details
x

ఈ పథకం కింద గ్యారెంటీ లేకుండా రుణాలు మంజూరు.. ఎవరు అర్హులంటే..?

Highlights

ఈ పథకం కింద గ్యారెంటీ లేకుండా రుణాలు మంజూరు.. ఎవరు అర్హులంటే..?

PM Svanidhi Yojana: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీధి వ్యాపారులు, చిన్న పారిశ్రామికవేత్తలు, పశువుల కాపరులకు దాదాపు రూ.1,550 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ప్రధాన మంత్రి స్వానిధి యోజన, ముద్రా యోజన, పశుపాలక్ కిసాన్ క్రెడిట్ కార్డ్ వంటి పథకాల కింద ఈ రుణాలు మంజూరు చేశారు. ప్రధాన మంత్రి స్వానిధి యోజన ( పీఎం స్వానిధి యోజన ) కింద రుణానికి ఎటువంటి హామి పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ పథకం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

ఈ పథకం ప్రయోజనం ముఖ్యంగా రోడ్డు పక్కన చిన్న వ్యాపారం చేసుకునేవారికి అందుతుంది. స్వనిధి యోజన కింద పట్టణ/గ్రామీణ ప్రాంతాల చుట్టూ రోడ్డుపై వస్తువులను విక్రయించే వ్యాపారులు లబ్ధిదారులుగా చెప్పవచ్చు. దేశంలోని వీధి వ్యాపారులు నేరుగా రూ.10,000 వరకు వర్కింగ్ క్యాపిటల్ లోన్‌ను పొందవచ్చు. వారు ఒక సంవత్సరంలో నెలవారీ వాయిదాలలో దీనిని తిరిగి చెల్లించవచ్చు. దాదాపు ఈ పథకం కింద 50 లక్షల మందికి పైగా లబ్ధి పొందారు.

ఈ రుణాన్ని సకాలంలో చెల్లించే వీధి వ్యాపారులకు ప్రభుత్వం వారి ఖాతాకు ఏడు శాతం వార్షిక వడ్డీ రాయితీగా బదిలీ చేస్తుంది. స్వానిధి యోజన కింద జరిమానా విధించే నిబంధన లేదు. టెక్నాలజీని ఉపయోగించి ప్రజల సామర్థ్యాన్ని పెంచడానికి, కరోనా సంక్షోభ సమయాల్లో వ్యాపారాన్ని తిరిగి స్థాపించడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌ను విజయవంతం చేయడానికి ఇది పని చేస్తుంది. ప్రజలు PM స్ట్రీట్ ఆత్మనిర్భర్ నిధి యోజన అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఈ పథకం కింద మీరు ఖాతాలోని మొత్తం డబ్బును మూడుసార్లు పొందుతారు. అంటే ప్రతి మూడు నెలలకు ఒక వాయిదా పొందుతారు. ఏడు శాతం వడ్డీతో ఈ రుణాన్ని పొందుతారు. బార్బర్ షాపులు, చెప్పులు కుట్టేవాడు, తమలపాకు దుకాణాలు, లాండ్రీ దుకాణాలు (ధోబిస్), కూరగాయలు అమ్మేవాడు, పండ్లు అమ్మేవాడు, స్ట్రీట్ ఫుడ్ అమ్మేవారు, టీ స్టాండ్, బ్రెడ్, గుడ్లు అమ్మేవారు, బట్టలు అమ్మే చిరువ్యాపారులు, పుస్తకాలు/స్టేషనరీ హోల్డర్లు తదితరులు ఈ పథకానికి అర్హులు అవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories