PPF vs SIP: పీపీఎఫ్‌ vs సిప్‌.. ఈ రెండింటిలో ఎందులో ఇన్వెస్ట్‌ చేస్తే తొందరగా రూ. కోటీ సంపాదించవచ్చు..!

PPF vs SIP In Which Of These Two Do You Invest Quickly Rs Can Earn Crores
x

PPF vs SIP: పీపీఎఫ్‌ vs సిప్‌.. ఈ రెండింటిలో ఎందులో ఇన్వెస్ట్‌ చేస్తే తొందరగా రూ. కోటీ సంపాదించవచ్చు..!

Highlights

PPF vs SIP: తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలంటే మంచి స్కీమ్‌లను ఎంచుకోవాలి. లేదంటే చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయి.

PPF vs SIP: తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలంటే మంచి స్కీమ్‌లను ఎంచుకోవాలి. లేదంటే చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే మార్కెట్‌లో ఉన్నవాటిలో బెస్ట్‌ స్కీమ్‌ని ఎంచుకొని ఇన్వెస్ట్‌ చేయడం ఉత్తమం. నిజానికి పెట్టుబడి అనేది దీర్ఘకాలికంగా ఉండడం వల్ల మంచి లాభాలను పొందవచ్చు. మార్కెట్ ఒడిదుడుకుల గురించి భయపడి డబ్బును విత్‌ డ్రా చేసుకుంటే ఎక్కువగా సంపాదించలేరు. స్మార్ట్ పెట్టుబడి వ్యూహాలను అనుసరిస్తే PPF లేదా SIPలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఈ రెండింటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

PPFలో

మీరు రిటైర్‌మెంట్ కోసం రోజూ రూ. 200 అంటే నెలలో రూ. 6,000 పెట్టుబడి పెడితే అది కొంత కాలానికి పెద్ద ఫండ్‌గా మారుతుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.72,000 జమ చేస్తారు. సాధారణంగా ప్రజలు PPFని సురక్షితంగా భావిస్తారు. ఎందుకంటే ఇది హామీతో కూడిన రాబడి అందిస్తుంది. ఇది ప్రజలకు రూ.150,000 వరకు పన్ను మినహాయింపును ఇస్తుంది. రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్ల వ్యవధిలో మొత్తం రూ.19 లక్షల 52 వేల 740 అవుతుంది. PPF కనీస మెచ్యూరిటీ పరిమితి పదిహేనేళ్లు.

మీరు ఈ మొత్తాన్ని 20 ఏళ్ల పాటు పీపీఎఫ్‌లో డిపాజిట్ చేస్తూనే ఉంటే ఆ మొత్తం రూ.31 లక్షల 95 వేల 978 లక్షలు అవుతుంది. మరో 5 ఏళ్లు పొడిగిస్తే రూ.49 లక్షల 47 వేల 847 వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే PPF అనేది సురక్షితమైన పెట్టుబడి. కానీ దాని వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు స్థిరంగా ఉంటుంది. ప్రస్తుతం పీపీఎఫ్‌పై వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. మీరు గమనిస్తే, 25 ఏళ్ల పాటు నిరంతరంగా ఇన్వెస్ట్ చేసినా మీరు కోటి రూపాయలు కూడా సంపాదించలేరు. అయితే SIP ద్వారా ఇది సాధ్యమవుతుంది.

SIPలో..

సిప్‌లో నెలకు రూ.6000 ఇన్వెస్ట్ చేస్తే 25 సంవత్సరాలు కొనసాగిస్తే 10 శాతం రాబడి వేసుకున్నా మెచ్యూరిటీపై రూ. 80 లక్షల 27 వేల 342 అవుతుంది. ఇప్పుడు ఈ పెట్టుబడిని 30 ఏళ్ల పాటు పొడిగిస్తే రూ.1 కోటి 36 లక్షల 75 వేల 952 రాబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌ ట్రేడింగ్‌లో ఉంది. దీని ప్రకారం రాబడి 12 నుంచి 15 శాతం మధ్య ఉంటే మీరు రూ. 2 కోట్ల నిధులను పొందుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories