Post Office: పోస్టాఫీసు అద్భుత స్కీం.. వారికి ఐదేళ్లలో అదిరిపోయే ఆదాయం..!

Post Office Senior Citizen Savings Scheme Check for all Details
x

Post Office: పోస్టాఫీసు అద్భుత స్కీం.. వారికి ఐదేళ్లలో అదిరిపోయే ఆదాయం..!

Highlights

Post Office: పోస్టాఫీస్ బంపర్ ఆదాయాన్ని ఆర్జించే అవకాశాన్ని అందిస్తోంది.

Post Office: పోస్టాఫీస్ బంపర్ ఆదాయాన్ని ఆర్జించే అవకాశాన్ని అందిస్తోంది. మీరు వివాహం చేసుకున్నట్లయితే పోస్టాఫీసు నుంచి రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చు. నిజానికి అనేక ప్రభుత్వ పథకాలు పోస్టాఫీసు నిర్వహిస్తోంది. అందులో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)ఒకటి. ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రాబడిని పొందవచ్చు. అయితే ఇందులో ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టాలి. మెచ్యూరిటీ తర్వాత ప్రతి త్రైమాసికంలో వడ్డీ డబ్బు అందుతుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సీనియర్‌ సిటిజన్‌ స్కీంలో రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.7.21 లక్షలు లభిస్తాయి. అందులో రూ.2.21 లక్షలు వడ్డీగా అందుతాయి. ఈ పథకంపై అక్టోబర్ 1, 2022 నుంచి ప్రభుత్వం 7.6 శాతం చొప్పున చక్రవడ్డీ ప్రయోజనాన్ని అందిస్తోంది. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. ప్రతి మూడు నెలలకి రూ. 11058 వడ్డీగా పొందుతారు. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి ఈ ఖాతాను తెరవవచ్చు.

ఇది కాకుండా 55 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు కానీ లేదా 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు VRS తీసుకున్నట్లయితే అతను SCSS లో ఖాతాను తెరవవచ్చు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ ఖాతాను తెరవవచ్చు. అయితే దీని కోసం మీరు గరిష్టంగా 15 లక్షలు పెట్టుబడి పెట్టాలి. మెచ్యూరిటీకి ముందు ఈ ఖాతాను క్లోజ్‌ చేస్తే కొంత మొత్తాన్ని ఛార్జీగా చెల్లించాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ అయిన వారికి ఇది సురక్షితమైన ఎంపిక అని చెప్పవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories