Post Office: పోస్టాఫీసు బంపర్ ఆఫర్.. రోజుకి రూ. 417 పొదుపు చేస్తే కోటి రూపాయలు..!

Post Office PPF Scheme If you Save Rs 417 per day the Fund Will be Worth Rs 1 Crore
x

Post Office: పోస్టాఫీసు బంపర్ ఆఫర్.. రోజుకి రూ. 417 పొదుపు చేస్తే కోటి రూపాయలు..!

Highlights

Post Office: పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం మీరు కోటీశ్వరుడయ్యే అవకాశాన్ని కల్పిస్తోంది.

Post Office: పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం మీరు కోటీశ్వరుడయ్యే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం ప్రతిరోజూ రూ.417 ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఈ ఖాతా మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు అయినప్పటికీ మీరు దానిని 5 సంవత్సరాల చొప్పున రెండుసార్లు పొడిగించవచ్చు. దీంతో పాటు పన్ను ప్రయోజనం కూడా పొందుతారు. ఈ ప్లాన్‌లో ఏటా 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది మీకు ప్రతి సంవత్సరం చక్రవడ్డీ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ పథకం మిమ్మల్ని ఎలా కోటీశ్వరుడిని చేస్తుందో తెలుసుకుందాం.

మీరు 15 సంవత్సరాల పాటు అంటే మెచ్యూరిటీ వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే సంవత్సరానికి గరిష్టంగా రూ. 1.5 లక్షలు అంటే నెలలో రూ. 12500 రూపాయలు అంటే రోజుకి రూ. 417 రూపాయలు డిపాజిట్‌ చేయాలి. ఈ మొత్తం పెట్టుబడి 22.50 లక్షలు అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో మీరు 7.1 శాతం వార్షిక వడ్డీతో కాంపౌండింగ్ ప్రయోజనం పొందుతారు. వడ్డీగా రూ.18.18 లక్షలు లభిస్తాయి. అంటే మొత్తం 40.68 లక్షల రూపాయలు లభిస్తాయి.

మీరు లక్షాధికారి ఎలా అవుతారు?

మీరు కోటీశ్వరుడు కావాలంటే 15 సంవత్సరాల తర్వాత వచ్చిన మొత్తాన్ని మీరు రెండుసార్లు అంటే 5 సంవత్సరాల చొప్పున రెండు సార్లు పెట్టుబడి పెట్టాలి. సంవత్సరానికి రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా మీ మొత్తం పెట్టుబడి రూ. 37.50 లక్షలు అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత మీరు 7.1 శాతం వడ్డీ రేటుతో రూ. 65.58 లక్షలు పొందుతారు. అంటే 25 ఏళ్ల తర్వాత మీ మొత్తం ఫండ్ 1.03 కోట్లు అవుతుంది.

PPF ఖాతాను ఎవరు ఓపెన్ చేయవచ్చు..?

జీతం పొందేవారు, స్వయం ఉపాధి పొందేవారు, పెన్షనర్లు ఎవరైనా సరే పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్‌ ఖాతా ఓపెన్ చేయవచ్చు. ఒక వ్యక్తి ఒక ఖాతాను మాత్రమే ఓపెన్‌ చేయగలడు. ఇందులో జాయింట్‌ ఖాతా ఉండదు. పిల్లల తరపున తల్లిదండ్రులు/సంరక్షకులు పోస్టాఫీసులో మైనర్ పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. ప్రవాస భారతీయులు ఇందులో ఖాతా తెరవలేరు.

Also Read

Post Office: పోస్టాఫీస్‌ సూపర్ స్కీం.. నెలకి రూ.1500 చెల్లిస్తే రూ.35 లక్షలు మీవే..!

Show Full Article
Print Article
Next Story
More Stories