Post Office: 10 ఏళ్లలో రూ. 17 లక్షలు సంపాదించే ఛాన్స్‌.. ఎలాగంటే..

Post office offering best saving scheme post office recurring deposit scheme details
x

Post Office: 10 ఏళ్లలో రూ. 17 లక్షలు సంపాదించే ఛాన్స్‌.. ఎలాగంటే.. 

Highlights

మరి పోస్టాఫీస్‌లో అందిస్తోన్న అలాంటి ఒక బెస్ట్‌ స్కీమ్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Post Office: ప్రస్తుతం యువత పొదుపు మంత్రం పాటిస్తోంది. మారుతోన్న ఆర్థిక అవసరాలు, పెరుగుతోన్న అవసరాల నేపథ్యంలో డబ్బు పొదుపు చేసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో సంపాదించడం మొదలు పెట్టిన రోజు నుంచే డబ్బు ఆదా చేస్తున్నారు. అయితే కష్టపడి సంపాదించిన సొమ్మును దాచుకునే ముందు ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటారు. సెక్యూరిటీతో పాటు, మంచి రిటర్న్స్‌ వచ్చేలా చూస్తుకుంటారు. ఇలాంటి పథకాల్లో పోస్టాఫీస్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడం, పెట్టిన పెట్టుబడికి ఎలాంటి ఢోకా ఉండకపోవడంతో చాలా మంది పోస్టాఫీస్‌ పథకాలపై ఆసక్తి చూపిస్తున్నారు

మరి పోస్టాఫీస్‌లో అందిస్తోన్న అలాంటి ఒక బెస్ట్‌ స్కీమ్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ​పోస్టాఫీస్ అందిస్తున్న పథకాల్లో రికరింగ్​ డిపాజిట్​ స్కీమ్‌ ఒకటి. ప్రస్తుతం ఈ రికరింగ్​ డిపాజిట్​ స్కీమ్‌ దేశంలోని పలు బ్యాంకులతో పాటు పోస్టాఫీస్‌లో కూడా ఈ స్కీమ్‌ అందుబాటులో ఉంటుంది. అయితే పోస్టాఫీస్‌లో పెట్టుబడి పెట్టడానికి ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఇది ఒక రకంగా టర్మ్​ డిపాజిట్ అని చెప్పాలి. ఇందులో ప్రతీ నెల కొంతమేర పొదుపు చేయొచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి 6.7 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.

ఈ పథకం ఐదేళ్లు మెచ్యురిటీ సమయం ఉంటుంది. అయితే కావాలనుకుంటే పథకాన్ని మరో ఐదేళ్లు పొడగించుకోవచ్చు. ఇందులో కనీసం రూ. 100 నుంచి గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఉదాహరణకు మీరు ప్రతీ నెల రూ. 2000 చొప్పున 5 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టుకుంటూ పోతే మొత్తం రూ. 1,20,000 అవుతుంది. అలాగే మరో ఐదేళ్లు పెట్టుబడి పెట్టుకుంటూ పోతే 10 ఏళ్ల తర్వాత వడ్డీతో కలిపి మొత్తం సుమారు రూ. 3.5 లక్షల వరకు పొందొచ్చు.

ఒకవేళ మీరు పదేళ్లలో రూ. 17 లక్షలు పొందాలనుకుంటే నెలకు ఎంత డిపాజిట్‌ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నెలకు రూ. 10 వేలు పెట్టుబడి పెడితే.. 5 ఏళ్ల మెచ్యూరిటీ సమయానికి మీ మొత్తం పెట్టుబడి వడ్డీతో కలిపి రూ.7 లక్షల 13వేలు అవుతుంది. అయితే.. మీరు మరో 5 సంవత్సరాలు పొడిగించారని అనుకుంటే అప్పుడు 10 సంవత్సరాల మెచ్యూరిటీ తర్వాత మీ పెట్టుబడి రూ.12 లక్షలు, దానిపై వడ్డీ రూ.5లక్షల 8వేల 546 అవుతుంది. అంటే 10 ఏళ్ల తర్వాత మీకు అసలు, వడ్డీతో కలిపి 17లక్షల 8వేల 546 రూపాయలు చేతికి వస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories