Saving scheme: మీ బుడ్డోడి భవిష్యత్తు కోసం ఈరోజే పొదుపు మొదలు పెట్టండి.. బెస్ట్‌ స్కీమ్‌..!

Post office offering best saving scheme for boy child
x

Saving scheme: మీ బుడ్డోడి భవిష్యత్తు కోసం ఈరోజే పొదుపు మొదలు పెట్టండి.. బెస్ట్‌ స్కీమ్‌ 

Highlights

Saving scheme: మీ బుడ్డోడి భవిష్యత్తు కోసం ఈరోజే పొదుపు మొదలు పెట్టండి.. బెస్ట్‌ స్కీమ్‌

Saving scheme: బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్క పేరెంట్ కృషి చేస్తుంటారు. తమ చిన్నారులు ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షిస్తుంటారు. ఇందుకోసం ఆర్థికంగా వారికి అండగా నిలవాలని తాపత్రయపడుతుంటారు. అందుకే ఇటీవల చిన్నారుల భవిష్యత్తు కోసం పొదుపు చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే మొన్నటి వరకు కేవలం ఆడ బిడ్డల కోసమే పొదుపు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారు. కానీ ప్రస్తుతం మారుతోన్న కాలానికి అనుగుణంగా మగ బిడ్డల కోసం కూడా పొదుపు చేస్తున్నారు.

ప్రభుత్వం సైతం మగబిడ్డల కోసం పథకాలను అందిస్తున్నాయి. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్‌ మగ బిడ్డలకోసం మంచి పథకాలను అమలు చేస్తోంది. బాలికల కోసం సుకన్య సమృద్ధి యోజన తీసుకొచ్చినట్లుగానే బాలుర కోసం కూడా కొన్ని పథకాలు అందుబాటులో ఉన్నాయని మీలో ఎంత మందికి తెలుసు.? అలాంటి ఓ బెస్ట్‌ స్కీమ్‌ గురించి ఈరోజు తెలుసుకుందాం..

మగ పిల్లల కోసం పోస్టాఫీస్‌ అందిస్తోన్న బెస్ట్‌ స్కీమ్స్‌లో కిసాన్‌ పత్ర పథకం ఒకటి. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ పథకం మంచి ఛాయిస్‌గా చెప్పొచ్చు. ఈ పథకాన్ని పోస్టాఫీస్‌ 1988లో తీసుకొచ్చింది. ముఖ్యంగా తక్కువ ఆదాయం వచ్చే వారికి, ఏడాదికి నిర్ధిష్ట మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటే 18 ఏళ్ల వయసు వచ్చిన వారెవరైనా ఈ స్కీమ్‌కు అర్హులు. అయితే, 18 ఏళ్ల లోపు వయసు ఉంటే వారి తరపున సంరక్షకులు, తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో కనిష్టంగా రూ. 1000, గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. పెట్టిన పెట్టుబడిపై వార్షిక వడ్డీ 7.9 శాతంగా నిర్ణయించారు. మెచ్యూరిటీ టెన్యూర్ పదేళ్ల 4 నెలలుగా ఉంటుంది. అంతేకాదండోయ్‌ ఈ పథకంలో తక్కువ వడ్డీ రేటుకే పేరెంట్స్‌ లోన్‌ కూడా తీసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories