Post Office Scheme For Women: ఈ పథకం మహిళలకు ప్రత్యేకం.. కేవలం రెండేళ్లలోనే.. !

These are the post office schemes that offer higher interest rates than government banks
x

Post Office Schemes: ప్రభుత్వ బ్యాంకుల కన్నా కూడా ఎక్కువ వడ్డీ అందించే పోస్టాఫీసు స్కీములు ఇవే 

Highlights

Post Office MSSC Scheme Details: ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది.

Post Office Scheme For Women: ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్‌ మంచి పథకాలను తీసుకొచ్చింది. ఇందలో ఒకటి మహిళా సమ్మాన్‌ సేవింగ్ సర్టిఫికేట్‌ స్కీమ్‌. 2023లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పథకంలో రూ. 1000 నుంచి గరిష్టంగా రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ సమయం రెండేళ్లుగా నిర్ణయించారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి ఏడాదికి 7.50 శాతం వడ్డీ లభిస్తుంది. ఇదొక స్వల్పకాలిక పెట్టుబడిగా చెప్పొచ్చు. ఒకవేళ పెట్టుబడి పెట్టిన తర్వాత ఏడాదికి 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే రెండేళ్లలో కేవలం ఒకసారి మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది.

ఈ పథకంలో చేరడానికి ఎలాంటి వయోపరిమితి లేదు. ఒకవేళ బాలికల పేరుతో ఖాతా ప్రారంభించాలంటే ఆమె పేరెంట్స్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఈ పథకంలో గరిష్టంగా రూ. 2 లక్షల పెట్టుబడి పెట్టారనుకుందాం. అయితే మీకు రెండేళ్ల తర్వాత మెచ్యూరిటీ సమయానికి రూ. 2,32,044 లభిస్తుంది. అంటే రెండేళ్లలో కేవలం వడ్డీ ద్వారా మీరు రూ. 32 వేలు పొందొచ్చన్నమాట.

ఈ పథకంలో వచ్చే వడ్డీ ఆదాయానికి టీడీఎస్‌ కట్ అవుతుంది. అయితే, వడ్డీ రూపంలో వచ్చిన ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 40,000 మించకపోతే TDS చెల్లించాల్సిన అవసరం లేదు. అలాంటి సందర్భంలో TDSకు బదులుగా, ఆ వడ్డీ ఆదాయం అకౌంట్‌ హోల్డర్‌ మొత్తం ఆదాయానికి యాడ్‌ అవుతుంది. రిటర్న్‌ ఫైల్‌ చేసే సమయంలో ఇన్‌కమ్‌ స్లాబ్ సిస్టమ్‌ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories