పదేళ్లు దాటిన పిల్లలపై ఈ ఖాతా తెరిస్తే నెలకు రూ.2500 లాభం.. ఎలాగంటే..?
MIS Account: రిస్క్ లేకుండా లాభాలు పొందాలనుకునేవారికి పోస్టాఫీసు పథకాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పోస్టాఫీసు MIS (monthly income scheme) అనేది అటువంటి పొదుపు పథకం. ఇందులో ఒక్కసారి పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా వడ్డీ రూపంలో లాభం వస్తూనే ఉంటుంది. ఈ ఖాతా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. 10 ఏళ్లు పైబడిన పిల్లల పేరిట ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. మీరు మీ పిల్లల పేరిట ఈ ఖాతాను తెరిస్తే ప్రతి నెలా పొందే వడ్డీతో ట్యూషన్ ఫీజు చెల్లించవచ్చు. ఈ పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
మీరు ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లి ఈ పొదుపు ఖాతాను తెరవవచ్చు. దీని కింద తక్కువలో రూ.1000, నుంచి గరిష్టంగా రూ.4.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ పథకం కింద వడ్డీ రేటు 6.6 శాతంగా ఉంది. మీ పిల్లల వయస్సు 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే మీరు అతని పేరు మీద ఈ ఖాతాను తెరవవచ్చు. ఒకవేళ తక్కువగా ఉంటే పిల్లాడికి బదులు తల్లిదండ్రులు ఈ ఖాతాను తెరవవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ 5 సంవత్సరాలు.
మీ పిల్లల వయస్సు 10 సంవత్సరాలు. మీరు అతని పేరు మీద రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా మీ వడ్డీ ప్రస్తుత 6.6 శాతం ప్రకారం రూ.1100 అవుతుంది. ఐదేళ్లలో ఈ వడ్డీ మొత్తం 66 వేల రూపాయలు అవుతుంది. చివరిగా మళ్లీ మీ 2 లక్షల రూపాయల తిరిగి పొందుతారు. ఈ విధంగా చిన్న పిల్లల కోసం, వారి చదువు కోసం ఉపయోగించగల 1100 రూపాయలు పొందుతారు. ఈ మొత్తం తల్లిదండ్రులకు మంచి సహాయంగా ఉంటుంది.
అంతేకాదు ఈ ఖాతాని ఒక్కరు లేదా ముగ్గురు పెద్దలతో ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. ఇందులో రూ. 3.50 లక్షలు జమ చేస్తే ప్రస్తుత రేటు ప్రకారం ప్రతి నెలా రూ.1925 పొందుతారు. బడిలో చదివే పిల్లలకు ఇది చాలా పెద్ద మొత్తం. ఈ వడ్డీ డబ్బుతో పిల్లల స్కూల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, పెన్-కాపీ ఖర్చులు సులభంగా తీరుతాయి. ఈ పథకం గరిష్ట పరిమితి అంటే 4.5 లక్షలు డిపాజిట్ చేస్తే మీరు ప్రతి నెలా రూ. 2475 ప్రయోజనం పొందవచ్చు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire