ఈ స్కీంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే.. ప్రతి నెలా రూ.5000 ఇంటికే వస్తాయి..!

Post Office Monthly Income Plan Intrest and Benefits
x

ఈ స్కీంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే.. ప్రతి నెలా రూ.5000 ఇంటికే వస్తాయి..!

Highlights

Monthly Income Plan: ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ఎల్లప్పుడూ సురక్షితం.

Monthly Income Plan: ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ఎల్లప్పుడూ సురక్షితం. పోస్టాఫీసులో ఇటువంటి అనేక పథకాలు ఉన్నాయి. వీటి ద్వారా మీరు సురక్షితమైన రాబడిని పొందుతారు. ఈ రోజు మనం పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించి ఒక పథకం గురించి తెలుసుకుందాం. ఇందులో పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రతి నెలా మీకు మంచి ఆదాయం వస్తుంది. ఈ పథకంలో మీరు ఒక్కసారి డబ్బును డిపాజిట్ చేస్తే ఆ తర్వాత ప్రతి నెలా వడ్డీ డబ్బు పెన్షన్ రూపంలో అందుతుంది.

ఈ పోస్టాఫీసు పథకంలో భార్యాభర్తలిద్దరూ ఇద్దరు కలిసి ఖాతా ఓపెన్‌ చేయవచ్చు. మీకు వివాహం కాకపోతే ఒంటరిగానైనా ఈ ఖాతాను తెరవవచ్చు. ఈ పోస్టాఫీసు పథకం పేరు 'మంత్లీ సేవింగ్ స్కీమ్'. ఇందులో ఒక్కసారి డబ్బును డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయం 5 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. ఇందులో లభించే రాబడి స్టాక్ మార్కెట్ హెచ్చు తగ్గులకు భిన్నంగా ఉంటుంది. ఈ పథకంలో గరిష్టంగా రూ.4.5 లక్షలు ఒక వ్యక్తి పేరు మీద పెట్టుబడి పెట్టవచ్చు. భార్యాభర్తలకి ఉమ్మడి ఖాతా ఉంటే ఈ మొత్తం రూ.9 లక్షలకు పెరుగుతుంది.

ఈ పథకం వార్షిక వడ్డీ రేటు 6.6%. అంటే మీరు రూ. 9 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి సంవత్సరం మీ వడ్డీ రూ. 59,400. దీన్ని 12 నెలల్లో భాగిస్తే ప్రతి నెలా రూ.4950 వస్తుంది. ఇందులో పెట్టిన పెట్టుబడి 5 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది. మీకు కావాలంటే మరో 5 సంవత్సరాలు ఈ పథకాన్ని పొడిగించుకోవచ్చు. ఈ ఖాతా మెచ్యూరిటీ సమయం 5 సంవత్సరాలు. కానీ మీరు ఈ ఖాతాను ముందుగా మెచ్యూర్ చేస్తే డిపాజిట్ మొత్తంలో 2 శాతం తీసివేసి 3 సంవత్సరాల తర్వాత తిరిగి చెల్లిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories