Business Idea: ఉన్న ఊర్లోనే ఉంటూ లక్షల్లో ఆదాయం.. బెస్ట్‌ బిజినెస్ ఐడియా..!

Polo Rings Making Business in Telugu
x

Business Idea: ఉన్న ఊర్లోనే ఉంటూ లక్షల్లో ఆదాయం.. బెస్ట్‌ బిజినెస్ ఐడియా..!

Highlights

Business Idea: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు ఆర్జించే ఏకైక మార్గం వ్యాపారం.

Business Idea: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు ఆర్జించే ఏకైక మార్గం వ్యాపారం. అయితే చాలా మంది పెట్టుబడికి భయపడో లేదా లాభాలు వస్తాయో లేదో అనే అనుమానంతో వ్యాపారం చేయడానికి వెనుకడుగు వేస్తుంటారు. అయితే ఆ భయాన్ని జయించి ముందడగు వేసిన వారే నలుగురికి ఆదర్శంగా నిలిచి వ్యాపారాల్లో సక్సెస్‌ అవుతుంటారు.

మరి తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఆర్జించే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా ఉన్న ఊర్లోనే ఉంటూ, మంచి లాభాలు పొందే అవకాశం కూడా ఉంది. అలాంటి ఓ బెస్ట్ బిజినెస్‌ ఐడియా గురించి ఈ రోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మార్కెట్లో చిన్నారులకు సంబంధించిన స్నాక్స్‌కు మంచి డిమాండ్ ఉంది. కార్న్‌తో తయారు చేసే స్నాక్స్‌కు చిన్నారులు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. కార్న్‌తో చేసినవి కావడంతో ఆరోగ్యానికి కూడా పెద్దగా హాని చేయకపోవడంతో వీటికి గిరాకీ పెరుగుతోంది.

అయితే ఈ స్నాక్‌ తయారీని ఉన్న ఊర్లోనే ఉంటూ, చిన్న స్థలంలోనే ఏర్పాటు చేసుకోవచ్చు. స్నాక్స్‌ తయారీ యూనిట్‌ను ప్రారంభిస్తే కాలక్రమేణ లక్షల్లో ఆదాయం పొందొచ్చు. కేవలం మీరు ఆదాయం పొందడమే కాకుండా మరో నలుగురికి కూడా ఉపాధి కల్పించవచ్చు. స్నాక్స్‌ తయారీ యూనిట్‌ను ప్రారంభించడానికి ఒక పెద్ద గది అవసరపడుతుంది. అలాగే ఫుడ్‌ సేఫ్టీ అధికారుల నుంచి లైసెన్స్ పొంది ఉండాలి.

స్నాక్స్‌లో పోలో రింగ్స్‌ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఇలాంటి వాటిని తయారు చేయడానికి కార్న్‌ పౌడర్‌ అవసరపడుతుంది. కార్న్‌ను రవ్వాలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ ముడి వస్తువు ఇన్‌స్టాంట్‌గా లభిస్తోంది. ఈ కార్న్‌ రవ్వను ఒక మిషన్‌లో వేయాలి. మనం స్నాక్‌ ఏ రూపంలో కావాలంటే ఆ డై సెట్ చేసుకోవడం ద్వారా ఆ ఆకారంలో వస్తుంది. రింగ్స్‌ తయారైన తర్వాత వాటిని సేకరించి. తర్వాత రోస్టింగ్ మిషిన్‌లో వేసి హీట్‌ సెట్‌ చేసుకోవాలి, దీంతో రింగ్స్‌ రోస్ట్‌ అవుతాయి. ఆ తర్వాత ఈ రింగ్స్‌కు మసాలా మిక్స్‌ చేయడానికి మరో మిషన్‌ అందుబాటులో ఉంటుంది.

వాటిలో రింగ్స్‌ను వేసి, మసాలాను జోడించాలి. దీంతో రింగ్స్‌ మొత్తానికి మసాలా బాగా పడుతుంది. దీంతో రింగ్స్‌ రడీ అయినట్లే. వీటిని మంచి కవర్స్‌లో ప్యాక్‌ చేసి, మీ సొంత బ్రాండింగ్‌తో సేల్ చేస్తే సరిపోతుంది. మీకు దగ్గర్లోని దుకాణాల్లో అమ్మకాలు జరపొచ్చు. ఈ వ్యాపారాన్ని రూ. 10 లక్షలతో ప్రారంభించవచ్చు, తక్కువలో తక్కువ నెలకు రూ. లక్ష వరకు సంపాదించొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories