రైతులకి గమనిక.. వాటి కొనుగోలుపై 50% సబ్సిడీ..!

PM Kisan Tractor Yojana Scheme the Government Gives 50% Subsidy to Farmers on the Purchase of Tractors Know how to Benefit
x

రైతులకి గమనిక.. వాటి కొనుగోలుపై 50% సబ్సిడీ..!

Highlights

PM Kisan Tractor Yojana: రైతుల ఆదాయాన్ని పెంచడానికి, ఆర్థికంగా ఆదుకోవడానికి మోడీ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది.

PM Kisan Tractor Yojana: రైతుల ఆదాయాన్ని పెంచడానికి, ఆర్థికంగా ఆదుకోవడానికి మోడీ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాలో ఏటా రూ.6000 జమ చేస్తుంది. అలాగే రైతులకు వ్యవసాయం చేయడానికి అనేక రకాల యంత్రాలు అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో వారికోసవ కేంద్ర ప్రభుత్వం ట్రాక్టర్ల కొనుగోలుపై సబ్సిడీ అందిస్తోంది. 'పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన' కింద ఈ సబ్సిడీని చెల్లిస్తోంది. ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నిజానికి రైతులు వ్యవసాయం చేయడానికి ట్రాక్టర్ చాలా ముఖ్యం. కానీ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో చాలామంది రైతులు ట్రాక్టర్ కొనలేని పరిస్థితిలో ఉంటారు. అంతేకాదు చాలామంది ట్రాక్టర్లు లేక ఎద్దులతో కాలం వెళ్లదీస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ట్రాక్టర్‌ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దీనికింద రైతులకు సగం ధరకే ట్రాక్టర్లను అందజేస్తారు.

50 శాతం సబ్సిడీ

రైతులకు ట్రాక్టర్లు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. దీని కింద రైతులు ఏ కంపెనీకి చెందిన ట్రాక్టర్లనైనా సరే సగం ధరకు కొనుగోలు చేయవచ్చు. మిగిలిన సగం డబ్బును ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. ఇది కాకుండా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత స్థాయిలో రైతులకు ట్రాక్టర్లపై 20 నుంచి 50 శాతం సబ్సిడీని అందిస్తున్నాయి.

ఈ పథకం ప్రయోజనాన్ని ఎలా పొందాలి?

1 ట్రాక్టర్ కొనుగోలుపై మాత్రమే ప్రభుత్వం ఈ సబ్సిడీని అందిస్తుందని గుర్తుంచుకోండి. మీరు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఆధార్ కార్డు, భూమి పత్రాలు, బ్యాంకు వివరాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అవసరమవుతాయి. ఈ పథకం కింద రైతులు సమీపంలోని ఏదైనా CSC కేంద్రాన్ని సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories