PM Kisan 19th Installment: రైతులకు అలర్ట్.. ఈ జాబితాలో కనుక మీ పేరు ఉంటే.. పీఎం కిసాన్ డబ్బులు రావు..!

PM Kisan 19th Installment
x

PM Kisan 19th Installment

Highlights

PM Kisan: దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వారికి పెట్టుబడి సాయం అందజేస్తోంది.

PM Kisan: దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వారికి పెట్టుబడి సాయం అందజేస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చి రైతులకు పంట సాయం అందజేస్తున్నారు. 2019లో ఈ పథకాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి సంవత్సరం 6 వేలు చొప్పున నగదు సాయం అందజేస్తోంది. అయితే ఒకేసారి ఇవ్వకుండా నేరుగా మూడు విడుతల్లో 2 వేల చొప్పున అందజేస్తుంది. ఇప్పటి వరకు 18 విడతల్లో అర్హులైన రైతులకు పంటసాయం అందించారు.

ఇప్పుడు 19వ విడత ప్రధానమంత్రి కిసాన్ సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధం అవుతుంది. అయితే, ఈ సారి చాలామంది రైతులు పథకం ప్రయోజనాలను పొందలేకపోవచ్చు. దీనికి కారణాలేంటో తెలుసుకుందాం.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద అర్హులైన ప్రతి రైతు ఖాతాలో రూ.36 వేలు జమయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ నెలలో ప్రధాని మోదీ 18వ విడత డబ్బులను విడుదల చేశారు. ఇప్పటికే రైతులకు ఈ మొత్తం ఖాతాల్లో జమయ్యాయి.

త్వరలోనే 19వ విడత డబ్బులు కూడా త్వరలోనే మంజూరు కానున్నాయి. కానీ, చాలా మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఈ సారి అనర్హులుగా మారే అవకాశం ఉంది. ఇందుకు కారణం.. రైతన్నలు స్కీమ్ గైడ్‌లైన్స్, ప్రొసీజర్ పాటించకపోవడమే. ఈ పథకానికి అర్హత పొందాలంటే రైతన్నలు తప్పనిసరిగా అప్లికేషన్ ప్రాసెస్‌‌ పూర్తి చేయాలి. అందులో ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డును లింక్ చేసుకోవడం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. కాబట్టి, దగ్గర్లోని మీ బ్యాంకుకి వెళ్లి ఆధార్ లింక్ ప్రాసెస్‌ని పూర్తి చేయాలి. ఈ స్కీమ్ ప్రయోజనం పొందాలంటే.. ఇ-కేవైసీ తప్పనిసరిగా చేయించాలి.

ఇది ఫేక్ లబ్ధిదారులకు పథకం వర్తించకుండా చేయడానికి ప్రభుత్వం ఈ ప్రాసెస్‌ను మాండేటరీ చేసింది. ఇప్పటివరకు మీరు ఇ-కేవైసీ చేయించకపోతే దగ్గర్లోని మీ సేవా సెంటర్ ను సంప్రదించి వెంటనే పూర్తి చేయండి. దీంతో పాటు భూమి హక్కులకు సంబంధించిన పత్రాలను స్థానిక రెవెన్యూ కార్యాలయాల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ పోర్టల్‌లోనూ రైతులు వారి సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవచ్చు.

పీఎం కిసాన్ సమ్మాన్ రూల్స్ ప్రకారం.. 2019 ఫిబ్రవరి 1 వరకు భూమి ఎవరి పేరుతో ఉంటే వారే పీఎం కిసాన్ స్కీమ్‌కు అర్హతను కలిగి ఉంటారు. ఐదేళ్ల పాటు అమలులో ఉండే ఈ రూల్స్ కారణంగా అర్హత కలిగిన రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భూ యజమానులు మరణిస్తే.. వారి వారసులకు భూమి చెందుతుంది. వీరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ వర్తిస్తుంది.

కానీ, ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి స్కీమ్ వర్తించడం లేదు. దీంతో చాలా మంది నష్టపోతున్నారు. మరోవైపు, 2019 ఫిబ్రవరి తర్వాత ఎవరైనా భూములు కొంటే.. వారికి కూడా ఈ స్కీమ్ వర్తించడం లేదు. అయితే, కేంద్రం విధించిన ఐదేళ్ల గడువు పూర్తవుతుంది. అయినా కూడా పాత నియమాలే కంటిన్యూ అవుతుండడంతో అర్హులైన రైతులు పథకం ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories