PM Kisan: రేపు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధులు విడుదల.. ఎలా చెక్​ చేసుకోవాలంటే?

PM Kisan 17th Installment Release Date Confirmed
x

PM Kisan: రేపు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధులు విడుదల.. ఎలా చెక్​ చేసుకోవాలంటే?

Highlights

PM Kisan 17th Installment: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే, ఈ వార్త మీకోసమే.

PM Kisan 17th Installment: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే, ఈ వార్త మీకోసమే. దేశంలోని కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి ఇంకా డబ్బులు రాకపోవడంతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. రైతులకు మోదీ సర్కార్​ శుభవార్త చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో "జూన్ 18వ" తేదీన.. పీఎం కిసాన్ 17వ విడత నిధులను విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా నేరుగా 9.3 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2వేలు చొప్పున 20వేల కోట్ల రూపాయల నిధులు వారి ఖాతాల్లో జమకానున్నాయి.

రూ. 6000 వార్షిక ఆర్థిక సహాయం..

రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా రైతులకు ఏటా రూ.6000 ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ డబ్బును అర్హులైన రైతుల ఖాతాలకు మూడు సమాన వాయిదాల్లో ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున అందిస్తారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో, మొదటి విడత ఏప్రిల్ నుంచి జులై వరకు, రెండవ విడత ఆగస్టు నుంచి నవంబర్ వరకు, మూడవ విడత డిసెంబర్ నుంచి మార్చి వరకు అందిస్తుంటారు.

పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే?

పీఎం కిసాన్ బెనిఫీషియరీ స్టేటస్, ఇన్​స్టాల్​మెంట్ స్టేటస్​ చెక్​ చేసుకోవడానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్​ను ఓపెన్ చేయండి.

ఇప్పుడు Know Your Status అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.

తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్​ను నమోదు చేసి, క్యాప్చా కోడ్​ను ఎంటర్‌ చేయాలి.

ఇప్పుడు Get Data అనే ఆప్షన్​పై క్లిక్ చేస్తే స్క్రీన్​పై మీ బెనిషియరీ స్టేటస్​ కనిపిస్తుంది.

లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో? లేదో? ఇలా చెక్​ చేసుకోవాలి?

ఫస్ట్‌ మీరు www.pmkisan.gov.in వెబ్​సైట్​ ఓపెన్ చేయాలి.

తర్వాత వెబ్​సైట్​లోని "Beneficiary List" ఆప్షన్​పై క్లిక్ చేయాలి.

ఇప్పుడు మీ స్టేట్‌, జిల్లా, మండలం, గ్రామం వివరాలను ఎంచుకోవాలి.

అలాగే లబ్ధిదారుల జాబితా కోసం ''Get Report" క్లిక్ చేయాలి. అంతే ఇలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు.

మీ గ్రామంలోని లబ్ధిదారుల పేర్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిలో మీ పేరు ఉందో? లేదో? చూసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories