PF Withdraw: ఈ పత్రాలు లేకుండా పీఎఫ్‌ డబ్బుని విత్‌ డ్రా చేయలేరు..!

PF Money Cannot be Withdrawn Without These Documents
x

PF Withdraw: ఈ పత్రాలు లేకుండా పీఎఫ్‌ డబ్బుని విత్‌ డ్రా చేయలేరు..!

Highlights

PF Withdraw: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌ (EPFO)అనేది ఉద్యోగుల కోసం ప్రభుత్వం నిర్వహించే రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్.

PF Withdraw: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌ (EPFO)అనేది ఉద్యోగుల కోసం ప్రభుత్వం నిర్వహించే రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్. ఇందులో ప్రతి నెలా ఉద్యోగులు తమ జీతంలో కొంత భాగాన్ని భవిష్య నిధికి జమ చేస్తారు. ఉద్యోగం నుంచి రిటైర్మెంట్‌ అయిన సమయంలో వడ్డీతో పాటు ఒకేసారి మొత్తాన్ని తీసుకోవడం ఈ పథకం లక్ష్యం. అయితే ఈపీఎఫ్‌వో ప్రావిడెంట్ ఫండ్‌ల నియంత్రణ, నిర్వహణకు బాధ్యత వహిస్తుంది.

ఈపీఎఫ్‌వో

భారత ప్రభుత్వం ప్రారంభించిన పొదుపు కార్యక్రమాలలో ఉద్యోగుల భవిష్య నిధి ఒకటి. దీనిని 1951లో స్థాపించారు. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ దీనిని పర్యవేక్షణ చేస్తుంది. ఈ పథకం ఒక వ్యక్తికి గణనీయమైన రిటైర్మెంట్ కార్పస్‌ను సేకరించడానికి సహాయపడుతుంది. ఇది వేతన తరగతి ఉద్యోగులలో డబ్బును పొదుపు చేసే అలవాటును పెంపొందిస్తుంది. యజమాని, ఉద్యోగి విరాళాలు ఈ ఫండ్‌లో చేర్చబడుతాయి. ఇద్దరు కూడా ఉద్యోగి బేసిక్‌ వేతనంలో 12%కి సమానంగా నెలవారీ సహకారం అందించాలి.

ఉపసంహరణ

కొన్ని అత్యవసర పరిస్థితులలో రిటైర్మెంట్‌కి ముందు కూడా ఈ ఫండ్ నుంచి డబ్బును విత్‌ డ్రా చేసుకోవచ్చు. అయితే దీనికి కొన్ని పత్రాలు అవసరం. ఈ పత్రాల సహాయంతో పీఎఫ్‌ డబ్బును సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. కాంపోసైట్‌ క్లెయిమ్‌ ఫారమ్‌, రెండు రెవెన్యూస్టాంపులు, బ్యాంక్ ఖాతా వివరాలు, గుర్తింపు రుజువు, చిరునామా రుజువు, IFSC కోడ్ ఖాతా నంబర్‌తో ఉన్న ఖాళీ చెక్ అవసరమవుతాయి.

అలాగే తండ్రి పేరు, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత సమాచారం గుర్తింపు రుజువుతో స్పష్టంగా సరిపోలాలి. ఒక ఉద్యోగి తన పీఎఫ్ మొత్తాన్ని 5 సంవత్సరాల నిరంతర సర్వీస్‌కు ముందు విత్‌డ్రా చేస్తే అతను ప్రతి సంవత్సరం పీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫారమ్ 2, 3ని అందించవలసి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories