ఉద్యోగులకి అలర్ట్.. 7 లక్షలు అస్సలు కోల్పోకండి..!

PF Account Holders Alert Dont Lose 7 Lakh Rupees at all
x

ఉద్యోగులకి అలర్ట్.. 7 లక్షలు అస్సలు కోల్పోకండి..!

Highlights

EPFO: ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

EPFO: ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన ఖాతాదారులకి 7 లక్షల రూపాయల ప్రయోజనాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం మీరు చేయాల్సింది కేవలం ఈ నామినేషన్ దాఖలు చేయడం. దీనివల్ల మీ కుటుంబానికి భద్రత కల్పించినవారవుతారు. ఈపీఎఫ్ ఖాతాలో ఈ-నామినేషన్ ఫైల్ చేసిన కస్టమర్ రూ.7 లక్షల ప్రయోజనం పొందుతారు.

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకి నోటీసు జారీ చేసింది. ఈపీఎఫ్‌ కలిగివున్న ప్రతి ఒక్కరికి ఈ-నామినేషన్ తప్పనిసరి అని పేర్కొంది. దీనివల్ల ఉద్యోగి ఏ విధమైన మరణం సంభవించినా అతడికి సంబంధించిన ప్రయోజనాన్ని నామినీకి అందిస్తారు. ఈపీఎఫ్‌వో ప్రతిఒక్క ఉద్యోగికి సామాజిక భద్రత కల్పిస్తోంది. అంతేకాదు మీరు ఈ నామినేషన్ చేయడానికి ఈపీఎఫ్‌వో కార్యాలయానికి వెళ్లనవసరం లేదు. ఇంట్లో కూర్చొని సులువుగా చేయవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

ఈ-నామినేషన్‌ను ఈ విధంగా పూర్తి చేయండి..

1. ముందుగా epfindia.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

2. ఇందులో సర్వీసెస్ ట్యాబ్‌లోకి వెళ్లి ఉద్యోగుల ఎంపికపై క్లిక్ చేయండి.

3. ఇప్పుడు మెంబర్ UAN / ఆన్‌లైన్ సర్వీస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

4. తర్వాత ఈ-సేవా పోర్టల్‌కి వెళ్లి మొత్తం సమాచారాన్ని ఎంటర్ చేయండి.

5. ఇక్కడ మీకు మేనేజర్ ట్యాబ్‌ కనిపిస్తుంది. అక్కడ YES ఎంచుకుని ఫ్యామిలీ సమాచారాన్ని ఎంటర్ చేయండి.

6. ఇప్పుడు నామినేషన్ వివరాలపై క్లిక్ చేసి ఎవరెవరికి ఎంత షేర్‌ అనేది తెలపాలి.

7. తర్వాత ఈపీఎఫ్ నామినేషన్ వివరాలను సేవ్ చేయాలి.

8. e-Sign ఎంపికపై క్లిక్ చేసిన తర్వాత మొబైల్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయాలి.

9. అంతే మీ మీ ఈ-నామినేషన్‌ ప్రక్రియ పూర్తయినట్లే.

Show Full Article
Print Article
Next Story
More Stories