మండుతున్న పెట్రో ధరలు!

Petrol Prices in Metro Cities Reached to All-Time High
x

Representational Image

Highlights

* సరికొత్త రికార్డ్ సృష్టిస్తున్న పెట్రోల్ ధరలు.. * రెండు రోజులుగా వరుసగా పెరిగిన పెట్రో ధరలు... * పెట్రోలియం కంపెనీల సమీక్ష ఫలితంగా భగ్గుమంటున్న ధరలు ...

దేశంలోని మెట్రోనగరాల్లో పెట్రో ధరలు ఆల్ టైమ్ హై కి చేరి సరికొత్త రికార్డ్ సృష్టిస్తున్నాయి వారం రోజులుగా పెట్రో ధరలు స్థిరంగా కొనసాగినప్పటికీ, గత రెండు రోజులుగా వరుసగా పెరగడంతో ధరలు భగ్గుమంటున్నాయి దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు లీటరుకు 26 నుంచి 32 పైసలు పెంచగా, డీజిల్ 29 నుంచి 33 పైసలు మేర పెరిగింది. రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 35 పైసలు మేర పెరిగి 86 రూపాయల 95 పైసలు, డీజిల్ 35 పైసలు చొప్పున పెరిగి 77 రూపాయల 13 పైసలు వద్దకు చేరాయి ఆర్దిక రాజధాని ముంబై లో లీటర్ పెట్రోల్ ధర 93 మార్క్ ఎగువన 93 రూపాయల 49 పైసలకు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 32 పైసలు పెరిగి 90 రూపాయల 42 పైసలు డీజిల్ ధర లీటర్‌ కు 33 పైసలు చొప్పున పెరిగి 84 రూపాయల14 పైసలు వద్ద కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో శుక్రవారం దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories