Petrol and Diesel Price: దేశంలో మరోసారి పెరిగిన చమురు ధరలు

Petrol and Diesel Prices in India Today 01 10 2021
x

దేశంలో మరోసారి పెరిగిన చమురు ధరలు(ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

* రికార్డు స్థాయికి పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు * లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెంపు

Petrol and Diesel Price Today: దేశంలో చమురు ధరలు మరోసారి పెరిగాయి. దీంతో పెట్రోల్‌, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు పెరగగా డీజిల్‌పై 30 పైసలు పెరిగింది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర నూట ఆరుకు చేరగా డీజిల్‌ ధర సెంచరీకి చేరువైంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర నూటొక రూపాయి 89 పైసలు ఉండగా డీజిల్ ధర 90 రూపాయల 17 పైసలకు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో నూట ఏడు రూపాయల 95 పైసలు లీటర్‌ పెట్రోల్‌ ధర ఉండగా డీజిల్ ధర 97 రూపాయల 84 పైసలకు పెరిగింది.

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యధికంగా రాజస్థాన్‌లో నమోదయ్యాయి. జైపూర్‌లో లీటర్‌ పెట్రోల్ ధర నూట ఎనిమిది రూపాయల 47 పైసలకు పెరగగా డీజిల్‌ ధర 99 రూపాయల 8 పైసలుగా ఉంది. అలాగే కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర నూట రెండు రూపాయల 17 పైసలు కాగా డీజిల్‌ ధర 92 రూపాయల 97 పైసల దగ్గర కొనసాగుతోంది. చెన్నైలో పెట్రోల్ ధర 99 రూపాయల 36 పైసలు ఉండగా డీజిల్‌ ధర 94 రూపాయల 45 పైసలు ఉంది. బెంగళూరులో నూట ఐదు రూపాయల 44 పైసలు ఉండగా డీజిల్‌ ధర 95 రూపాయల 70 పైసలకు పెరిగింది.

మరోపక్క వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌ ధర ‎భారీగా పెరిగింది. ఒకేసారి 43 రూపాయలు పెంచుతూ పెట్రోలియం కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధర ప్రస్తుతం 17వందల 36 రూపాయల 50 పైసలుగా ఉంది. నేటి నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే సెప్టెంబర్‌ 1న వాణిజ్య ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను 75 రూపాయలు పెంచింది పెట్రోలియం కంపెనీలు.

Show Full Article
Print Article
Next Story
More Stories