E Shram Portal: ఈ శ్రమ్‌ పోర్టల్‌లో ఈ 5 రాష్ట్రాల ప్రజలే ఎక్కువగా ఉన్నారు.. ఎందుకంటే..?

E Shram Portal: ఈ శ్రమ్‌ పోర్టల్‌లో ఈ 5 రాష్ట్రాల ప్రజలే ఎక్కువగా ఉన్నారు.. ఎందుకంటే..?
x

E Shram Portal: ఈ శ్రమ్‌ పోర్టల్‌లో ఈ 5 రాష్ట్రాల ప్రజలే ఎక్కువగా ఉన్నారు.. ఎందుకంటే..?

Highlights

E Shram Portal: అసంఘటిత రంగంలో పనిచేసే వారికి ఈ శ్రమ్‌ పోర్టల్‌ ఒకవరం లాంటిది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.

E Shram Portal: అసంఘటిత రంగంలో పనిచేసే వారికి ఈ శ్రమ్‌ పోర్టల్‌ ఒకవరం లాంటిది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పటివరకు 17 కోట్ల మంది కార్మికులు ఈ-శ్రమ్ కార్డ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఈ-శ్రమ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో మహిళలే అత్యధికంగా ఉండటం విశేషం. దేశంలోని ఏ ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులైనా ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఈ పోర్టల్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి చాలా మంది కార్మికులు ఈ పోర్టల్‌లో చేరారు. ఇందులో ఎక్కువగా ఈ ఐదు రాష్ట్రాల కార్మికులు పేర్లు నమోదు చేసుకున్నారు.

కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. ఉత్తరప్రదేశ్ కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్‌లో గరిష్ట సంఖ్యలో రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకున్నారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో, బీహార్ మూడో స్థానంలో, ఒడిశా నాలుగో స్థానంలో, జార్ఖండ్ ఐదో స్థానంలో ఉన్నాయి. ఇది కాకుండా ఇప్పటివరకు 47.02 శాతం పురుషులు, 52.98 శాతం మహిళలు ఇందులో చేరారు. ఈ-శ్రామ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా అప్లై చేసుకుంటున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ఈ ప్రభుత్వ పథకంలో చేరిన కార్మికులు భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందగలరు.

ఈ-శ్రమ్ కార్డ్ ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ముందుగా ఈ -శ్రమ్ పోర్టల్ (eshram.gov.in) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. తర్వాత మీరు హోమ్ పేజీకి వెళ్లి రిజిస్టర్ ఆన్ ఈ-ష్రామ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ ఫారమ్ న్యూ పేజీలో ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీరు మీ ఆధార్ కార్డ్ లింక్ చేసిన మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్, EPFO, ESIC సభ్యుల స్థితిని నమోదు చేయాలి. ఈ ప్రక్రియ తర్వాత మొబైల్ నంబర్‌కు OTP పంపే ఎంపికను ఎంచుకోవాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి OTP వస్తుంది. దీనిని OTP బాక్స్‌లో టైప్ చేయాలి. తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి. దీంతో పాటు అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. చివరకు ఓకె బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ ప్రాసెస్ పూర్తవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories