ఈ పథకం కింద జన్‌ధన్‌ ఖాతా ఉంటే రూ.3000 పెన్షన్.. ఎలాగంటే..?

Pension of Rs.3000 per month under pradhan mantri shram yogi  maandhan yojana if Jan dhan account
x

ఈ పథకం కింద జన్‌ధన్‌ ఖాతా ఉంటే రూ.3000 పెన్షన్.. ఎలాగంటే..?

Highlights

ఈ పథకం కింద జన్‌ధన్‌ ఖాతా ఉంటే రూ.3000 పెన్షన్.. ఎలాగంటే..?

Jan Dhan Account: అసంఘటిత రంగంలోని అల్పాదాయ ప్రజలకు రిటైర్మెంట్‌ తర్వాత పెన్షన్‌ను సులభతరం చేయడానికి ప్రధానమంత్రి శ్రమ యోగి మంధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది స్వచ్ఛంద, కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం. ఇందులో ఇప్పటివరకు 45 లక్షల మందికి పైగా చేరారు. 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల భారతీయులు ఎవరైనా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇందులో 60 ఏళ్లు దాటిన తర్వాత రూ.3000 పెన్షన్ పొందుతారు. జన్ ధన్ ఖాతాదారులు ఈ పథకం కింద పెన్షన్‌కు అర్హులు.

ఈ పథకం కింద అసంఘటిత రంగంలోని కార్మికులు, గృహ నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన కార్మికులు, హమాలీ కార్మికులు, ఇటుక బట్టీ కార్మికులు, చెప్పులు కుట్టేవారు, చాకలివారు, రిక్షా పుల్లర్లు, భూమిలేని కూలీలు ప్రయోజనం పొందుతారు. దీంతోపాటు వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, తోళ్ల కార్మికులు కూడా అర్హులవుతారు. నెలవారీ ఆదాయం రూ.15,000 మించని కార్మికులకు ఈ పథకం ప్రయోజనం అందుతుంది.

ఈ పథకం కింద 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా రూ.3000 అంటే సంవత్సరానికి రూ.36,000 పెన్షన్ లభిస్తుంది. EPFO, NPS లేదా ESICలో సభ్యులుగా ఉన్న వారు ఈ పథకం ప్రయోజనాన్ని పొందలేరు. ఆదాయపు పన్ను చెల్లించేవారు ఈ పథకానికి అర్హులు కాదు. PM శ్రమ యోగి మాన్‌ధన్ యోజన కోసం కేవలం రెండు పత్రాలు మాత్రమే ఆధార్ కార్డ్, సేవింగ్స్ ఖాతా / జన్ ధన్ ఖాతా (IFSC కోడ్‌తో) అవసరం. మీకు జన్ ధన్ ఖాతా ఉంటే ఈ పథకంలో చేరవచ్చు. దీని కోసం మీరు ప్రత్యేక పొదుపు ఖాతాను తెరవాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా మీరు మీ మొబైల్ నంబర్‌ను కూడా నమోదు చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories