పేటీఎంను అందుకే తొలగించాం: గూగుల్

పేటీఎంను అందుకే తొలగించాం: గూగుల్
x

Paytm ( File Photo)

Highlights

Paytm Removed From Play Store : గూగుల్ ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలిగించబడింది.. అయితే తమ నిబంధనలను ఉల్లగించడం

Paytm Removed From Play Store : గూగుల్ ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలిగించబడింది.. అయితే తమ నిబంధనలను ఉల్లగించడం వలనే పేటీఎం యాప్ ను తొలిగించినట్లుగా గూగుల్ అధికారికంగా వెల్లడించింది.. వినియోగదారుల సురక్షితను దృష్టిలో పెట్టుకుని గూగుల్ ప్లే స్టోర్ ను రూపొందించామని వెల్లడించింది.. తాము ఎలాంటి ఆన్‌లైన్ కాసినోలకు లేదా జూదం యాప్‌లకు అనుమతించలేదని తెలిపింది.

కానీ పేటీఎం యాప్.. కస్టమర్లు క్యాష్ ప్రైజులు గెలిచేలా రియల్ టోర్నమెంట్లకు సంబంధించి స్పోర్ట్స్ బెట్టింగ్ నిర్వహిస్తోందని తెలిపింది. అందుకే తాము ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించినట్లు స్పష్టం చేసింది. కాగా, ప్లేస్టోర్‌లో పేటీఎం బిజినెస్, పేటీఎం మాల్, పేటీఎం మనీ యాప్‌లు మాత్రం ఉన్నాయి.

పేటీఎం కస్టమర్లకు విజ్ఞప్తి :

గూగుల్ ప్లేస్టోర్ నుంచి తమ యాప్‌ను తొలగించడంపై పేటీఎం స్పందించింది. పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ తాత్కాలికంగా అందుబాటులో ఉండదు. కొత్త పేటీఎం యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి, యాప్ అప్‌డేట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. పేటీఎం యూజర్ల డబ్బులు భద్రంగానే ఉన్నాయి. మీ పేటీఎం లావాదేవీలు ఎప్పట్లాగే చేసుకోవచ్చు' అని పేటీఎం తెలిపింది. ఇక పేటీఎంకి భారత్ లోనే 50 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories