RBI Governor: బ్యాంకుల్లో రూ.50వేలకు మించి 2వేల నోట్లు డిపాజిట్‌ చేస్తే.. పాన్‌కార్డు తప్పనిసరిగా చూపించాలి

PAN Card For Deposits of Rs 50,000 or More in  Deposits of Rs 2,000 Currency Notes Says RBI Governor Shaktikanta Das
x

RBI Governor: బ్యాంకుల్లో రూ.50వేలకు మించి 2వేల నోట్లు డిపాజిట్‌ చేస్తే.. పాన్‌కార్డు తప్పనిసరిగా చూపించాలి

Highlights

RBI Governor: క్లీన్‌ నోట్‌ పాలసీలో భాగంగానే రూ.2 వేల నోటు రద్దు

RBI Governor: 2వేల నోట్లు ఉపసంహరణపై ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అనుకున్న లక్ష్యం నెరవేరిందంటూ పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత ఉపశమనం కోసమే 2వేల నోటు తీసుకువచ్చామని.. ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరిందన్నారు..అందుకే ఉపసంహరించుకుంటున్నామని శక్తికాంత దాస్ తెలిపారు. 2వేల రూపాయల స్థానంలో ఇప్పుడు సరిపడా నోట్లు ఉన్నాయన్నారు. భవిష్యత్‌లో వెయ్యి నోటు తెచ్చే యోచన కూడా లేదని శక్తికాంత దాస్ తెలిపారు.

ఈలోగా ఎన్ని నోట్ల మార్పిడి, డిపాజిట్లు జరుగుతున్నాయో బ్యాంక్‌లు ఆర్బీఐకి చెప్పాల్సిందేని శక్తికాంత దాస్ స్పష్టంచేశారు. 50వేల విలువ దాటిన నోట్ల మార్పిడి, డిపాజిట్‌కి పాన్‌కార్డ్ తప్పనిసరని శక్తికాంతదాస్ తెలిపారు. నోట్ల మార్పిడి వ్యవహారంలో ఆర్బీఐ జోక్యం చేసుకోదన్నారు. ఇతర ఏజెన్సీల ప్రమేయంతో ఆర్బీఐకి సంబంధం లేదని స్పష్టంచేశారు. సెప్టెంబర్ 30లోపు అన్ని నోట్లు వెనక్కి వస్తాయని ఆశిస్తున్నామని.. ఒకవేళ రాకపోతే ఏం చెయ్యాలనేది అప్పుడు ఆలోచన చేస్తామని శక్తికాంత దాస్ వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories