Oyo Hotels: వారికి భారీ డిస్కౌంట్‌ ప్రకటించిన ఓయో.. కారణం ఏంటంటే..?

Oyo Hotels Announces 60% Discount on MSME Day
x

Oyo Hotels: వారికి భారీ డిస్కౌంట్‌ ప్రకటించిన ఓయో.. కారణం ఏంటంటే..?

Highlights

Oyo Hotels: మీరు అవుట్‌ డోరో ట్రిప్‌లలో భాగంగా తరచుగా ఓయోహోటల్స్ లేదా ఓయో రూమ్‌లలో బస చేస్తే ఈ విషయం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది.

Oyo Hotels: మీరు అవుట్‌ డోరో ట్రిప్‌లలో భాగంగా తరచుగా ఓయోహోటల్స్ లేదా ఓయో రూమ్‌లలో బస చేస్తే ఈ విషయం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. భారతదేశపు ప్రసిద్ధ ఆన్‌లైన్ హోటల్ బుకింగ్ సైట్, ప్లాట్‌ఫారమ్ అయిన ఓయో ప్రపంచ MSME (సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు) దినోత్సవం సందర్భంగా ఆకర్షణీయమైన స్కీమ్‌తో ముందుకు వచ్చింది. ఈ పథకం కింద, ఓయో వినియోగదారులకు ఓయో గదులను చౌకగా బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది.

ఓయో అందిస్తున్న ఆఫర్

ఓయో అందిస్తున్న ఆఫర్ కింద కస్టమర్లు 60 శాతం వరకు తగ్గింపుతో హోటల్‌లో గదులను బుక్ చేసుకోవచ్చు. వాస్తవానికి చిన్న వ్యాపారాలతో ఎక్కువగా తిరిగే వ్యక్తుల కోసం ఓయో ద్వారా 60 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ సదుపాయం చిన్న, మధ్య తరహా వ్యాపారవేత్తలకు మాత్రమే అని తెలియజేసింది.

ప్రపంచ MSME దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. చిన్న, మధ్య తరహా వ్యాపారాలతో అనుబంధం ఉన్న వ్యక్తులు జూన్ 27 నుంచి జూలై 3,2022 వరకు ఓయో హోటల్‌లలో బస చేయడంపై 60 శాతం తగ్గింపును పొందుతారు. దేశవ్యాప్తంగా ఓయోకు చెందిన దాదాపు 2,000 ప్రాపర్టీలలో 10 వేలకు పైగా గదులపై ఈ తగ్గింపు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories