Pension: ప్రతి నెలా రూ.5000 పెట్టుబడితో 45,000 పెన్షన్..!

Open NPS account in name of family members get pension every month
x

Pension: ప్రతి నెలా రూ.5000 పెట్టుబడితో 45,000 పెన్షన్..!

Highlights

Pension: ప్రతి నెలా రూ.5000 పెట్టుబడితో 45,000 పెన్షన్..!

Pension: ప్రతి వ్యక్తి పెట్టుబడి పెట్టిన డబ్బు సురక్షితంగా ఉండాలని మంచి రాబడి రావాలని కోరుకుంటాడు. మరొక విషయం ఏంటంటే ఆ పెట్టుబడి అనేది కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ఉపయోగపడాలని ఆశిస్తాడు. అందుకే తాను ఉన్నా లేకున్నా కుటుంబానికి నిరంతరం ఆదాయం ఉండే స్కీముల గురించి అన్వేషిస్తాడు. ఇందుకు సరిగ్గా సరిపోతుంది నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌. ఇందులో మీరు 60 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి పెట్టినా మంచి రాబడిని పొందుతారు.

మీరు మీ కుటుంబ సభ్యుల పేరుపై నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో ఖాతా ఓపెన్‌ చేయవచ్చు. ఉదాహరణకు మీ భార్య పేరు మీద ఖాతాను తీసుకోవచ్చు. దీనివల్ల మీ భార్య వయసు 60 ఏళ్లు నిండాక పెట్టుబడి డబ్బు తిరిగి వస్తుంది. అలాగే ప్రతి నెలా పెన్షన్ రూపంలో రెగ్యులర్ ఆదాయం ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత మీరు ప్రతి నెలా పెన్షన్ పొందుతారు. ఎన్‌పీఎస్‌ ఖాతాతో ప్రతి నెల ఎంత పెన్షన్ పొందాలో మీరే నిర్ణయించవచ్చు. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టడం చాలా సులభం. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) అనేది దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళిక. ఇది ప్రభుత్వ ఉద్యోగుల కోసం జనవరి 2004లో ప్రారంభించారు. తరువాత 2009 సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలకు అవకాశం కల్పించారు. ఏ వ్యక్తి అయినా పెన్షన్ ఖాతా ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు. ఇందులో కొంత భాగాన్ని ఒకే మొత్తంలో విత్‌డ్రా చేసుకోవచ్చు. రిటైర్మెంట్‌ తర్వాత మిగిలిన మొత్తాన్ని పెన్షన్ కోసం ఉపయోగించవచ్చు. ఇందులో మీరు ప్రతి నెల లేదా ఏటా డబ్బు డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

మీరు నెలకు 1,000 రూపాయల నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. ఖాతా 60 సంవత్సరాల వయస్సులో మెచ్యూర్ అవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం మీరు 60 ఏళ్ల వయస్సు వరకు ఖాతాలో పెట్టుబడి పెట్టవచ్చు. ఉదాహరణకు మీరు 30 సంవత్సరాల వయస్సులో మీ భార్య పేరుపై ఖాతాను తెరిచి ప్రతి నెలా రూ. 5000 పెట్టుబడి పెడితే ఈ మొత్తానికి 10 శాతం వార్షిక రాబడి వస్తే మొత్తం రూ.1.13 కోట్లు జమవుతాయి. ఇందులో 40 శాతం ఏకమొత్తంలో దాదాపు 45 లక్షల రూపాయలు అందుతాయి. మిగిలిన వారి నుంచి నెలకు దాదాపు 45 వేల రూపాయల పెన్షన్‌ లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories