SBI: ఎస్బీఐ ఖాతాదారులకి గమనిక.. ఏటీఎం నుంచి మనీ విత్‌ డ్రాలో మార్పులు..!

Note to SBI Customers Changes in Money Withdrawal From ATM
x

SBI: ఎస్బీఐ ఖాతాదారులకి గమనిక.. ఏటీఎం నుంచి మనీ విత్‌ డ్రాలో మార్పులు..!

Highlights

SBI: మీరు ATM నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తే నియమాలు మారాయని తెలుసుకోండి.

SBI: మీరు ATM నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తే నియమాలు మారాయని తెలుసుకోండి. ఏటీఎం లావాదేవీలను మరింత సురక్షితం చేసేందుకు ఎస్‌బీఐ నిబంధనలను మార్చింది. కొత్త నిబంధనల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు SBI ATM నుంచి నగదు తీసుకోవడానికి OTPని ఎంటర్ చేయాలి. ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం.. కస్టమర్లు ఓటీపీ లేకుండా నగదు తీసుకోలేరు. నగదు విత్‌ డ్రా సమయంలో ఖాతాదారులు మొబైల్ ఫోన్‌కి ఓటీపీ వస్తుంది. దీనిని నమోదు చేసిన తర్వాత మాత్రమే ఎటిఎం నుంచి నగదు తీసుకోగలరు.

ఈ సమాచారం గురించి బ్యాంక్ ఒక ట్వీట్‌లో తెలియజేస్తూ 'మా OTP ఆధారిత నగదు విత్‌ డ్రా వ్యవస్థ మోసగాళ్ల నుంచి కస్టమర్లని రక్షించడానికి అని తెలిపింది. OTP ఆధారిత నగదు విత్‌ డ్రా వ్యవస్థ ఎలా పని చేస్తుందో SBI కస్టమర్‌లు తెలుసుకోవాలి'రూ. 10,000కంటే ఎక్కువ విత్‌ డ్రాలపై ఈ నియమాలు వర్తిస్తాయని తెలుసుకోండి. SBI కస్టమర్లు తమ ATM నుంచి ప్రతిసారీ రూ. 10,000 అంతకంటే ఎక్కువ విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంక్ ఖాతా నుంచి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.

కొత్త నిబంధనలను తెలుసుకోండి

SBI ATM నుంచి నగదును విత్‌డ్రా చేయడానికి మీరు OTPని ఎంటర్ చేయాలి. దీని కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. కస్టమర్ ఒకే లావాదేవీకి నాలుగు అంకెల నంబర్‌తో OTPని పొందుతారు. నగదు విత్‌ డ్రా కోసం మీరు ఏటీఎం స్క్రీన్‌లో బ్యాంక్‌లో మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయాలి. సైబర్‌ నేరస్థుల నుంచి ఖాతాదారులని కాపాడటానికి ఈ నిబంధనలని రూపొందించినట్లు ఎస్బీఐ తెలిపింది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన SBI భారతదేశంలో 71,705 BCఅవుట్‌లెట్లతో 22,224 శాఖలు, 63,906 ATM/CDMల అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories