Personal Loan: పర్సనల్‌ లోన్‌ తీసుకునేవారికి గమనిక.. తక్కువ వడ్డీకి ఎక్కువ అమౌంట్‌ ..?

Note To Personal Loan Borrowers What Should Be Done To Get More Amount At Low Interest
x

Personal Loan: పర్సనల్‌ లోన్‌ తీసుకునేవారికి గమనిక.. తక్కువ వడ్డీకి ఎక్కువ అమౌంట్‌ ..?

Highlights

Personal Loan: జీవితంలో ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటాయి కానీ ఆదాయం సరిపడా ఉండదు.

Personal Loan: జీవితంలో ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటాయి కానీ ఆదాయం సరిపడా ఉండదు. ఎప్పుడు లోటు బడ్జెట్‌లోనే ఉంటారు. ఇలాంటి వారు అత్యవసర పరిస్థితుల్లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటారు. ఎందుకంటే మిగతా లోన్లకు ప్రాసెస్‌ ఎక్కువగా ఉంటుంది. కానీ వీటికి పేపర్‌ వర్క్‌ తక్కువగా ఉంటుంది. లోన్‌ తొందరగా మంజూరవుతుంది. అయితే బ్యాంకులు కానీ ఫైనాన్షియల్ సంస్థలు కానీ వీటిని అసురక్షిత లోన్లుగా భావిస్తారు. ఎందుకంటే వీటికింద తాకట్టు ఏమీ ఉండవు. అందుకే వీటిపై వడ్డీ ఎక్కువ వసూలు చేస్తారు. ఈ కారణంగా పర్సనల్‌ లోన్‌ ఏ విధంగా తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

క్రెడిట్ స్కోర్

బ్యాంకులు కానీ పైనాన్షియల్‌ సంస్థలు కానీ పర్సనల్ లోన్ ఇచ్చే ముందు మన క్రెడిట్ స్కోర్ ను పరిశీలిస్తారు. దీని ఆధారంగా లోన్‌ ఇవ్వాలా వద్దా, ఎంత వడ్డీ విధించాలి అనే విషయాలను నిర్ణయిస్తారు. అందుకే మనం క్రెడిట్ స్కోర్ ను పెంచుకోవాలి. దానిని సక్రమంగా మెయింటెన్‌ చేయడం వల్ల పాయింట్లు పెరుగుతాయి. అవే మీకు రుణాలు మంజూరు చేయడానికి దోహదపడతాయి. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తి తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందే అవకాశం ఉంటుంది. డిఫాల్ట్‌లు లేకుండా సకాలంలో వాయిదాలను చెల్లించగల మీ సామర్థ్యాన్ని క్రెడిట్ స్కోర్ సూచిస్తుంది.

ప్రాసెసింగ్‌ ఫీజు

మనం తీసుకునే రుణానికి అనేక ఇతర రుసుములు కలుపుతారు. ఇవన్నీ రుణ మొత్తాన్ని పెంచుతాయి. కాబట్టి రుణం తీసుకునే ముందే ప్రాసెసింగ్‌ ఫీజు గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా వడ్డీ ఇతర ఖర్చులను ఎంత కలిపారో తెలుసుకోవాలి. లేదంటే చాలా నష్టపోతారు.

వడ్డీ రేట్ల వివరాలు

రుణాలపై వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండవు. వివిధ బ్యాంకులు వివిధ రకాల వడ్డీలను వసూలు చేస్తాయి. ప్రాసెసింగ్ చార్జీలు కూడా మారుతూ ఉంటాయి. రుణం విషయంలో నిబంధనలు, షరతులు కూడా బ్యాంకుల ప్రకారం మారుతూ ఉంటాయి. కాబట్టి రుణం తీసుకునే ముందు వాటినన్నింటినీ పరిశీలించాలి. ఏ బ్యాంకు నిబంధనలు అనుకూలంగా ఉన్నాయో, ఎక్కడ తక్కువ చార్జీలు విధిస్తారో అక్కడ లోన్‌ తీసుకోవడానికి ట్రై చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories