LPG Customers: ఎల్పీజీ కస్టమర్లకి గమనిక.. సిలిండర్‌తో పాటు ఈ వస్తువులు కూడా..!

Note to LPG customers Dabur and IOCL tie up
x

LPG Customers: ఎల్పీజీ కస్టమర్లకి గమనిక.. సిలిండర్‌తో పాటు ఈ వస్తువులు కూడా..!

Highlights

LPG Customers: ఎల్పీజీ కస్టమర్లకి గమనిక.. సిలిండర్‌తో పాటు ఈ వస్తువులు కూడా..!

LPG Customers: మీకు ఇండియన్ ఆయిల్ గ్యాస్ కనెక్షన్ ఉంటే ఈ వార్త కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు మీకు సిలిండర్ తీసుకొచ్చే డెలివరీ బాయ్ ఇంట్లోకి అవసరమయ్యే వస్తువులను కూడా తీసుకువస్తాడు. ఇక మీరు వస్తువులను పొందడానికి మార్కెట్‌కు వెళ్లవలసిన అవసరం లేదు. ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తుల తయారీ సంస్థ డాబర్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఒసిఎల్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఇండియన్ గ్యాస్‌ కస్టమర్లకి డాబర్ కంపెనీ ఉత్పత్తులను విక్రయించనుంది.

డాబర్, ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన ఒక ప్రకటనలో "ఈ ఒప్పందంతో 140 మిలియన్ల మంది ఇండేన్ వినియోగదారులు దేశవ్యాప్తంగా డాబర్ ఉత్పత్తులను యాక్సెస్ చేయగలరు." కంపెనీ ప్రకటన ప్రకారం.. 'ఈ టై-అప్ ప్రకారం ఇండియన్ ఆయిల్ డిస్ట్రిబ్యూటర్స్‌ డాబర్‌ వస్తువులని విక్రయిస్తారు. డెలివరీ సిబ్బంది ద్వారా అన్ని డాబర్ ఉత్పత్తులను నేరుగా LPG కస్టమర్ల కుటుంబాలకు అందించడానికి ప్రయత్నిస్తారు.

దీని కోసం ఇండియన్ ఆయిల్, డాబర్‌లు టెక్నికల్ సిస్టమ్ ఇంటిగ్రేషన్‌పై పనిచేస్తున్నాయి. ఈ చొరవతో పెద్ద సంఖ్యలో భారతీయ కుటుంబాలకు డాబర్ వస్తువులని విక్రయిస్తారు. ఇండియన్ ఆయిల్‌ కంపెనీకి చెందిన 12,750 మంది డిస్ట్రిబ్యూటర్లు, 90,000 మందికి పైగా డెలివరీ వర్కర్లు 143 కోట్ల కుటుంబాల వంట గ్యాస్ అవసరాలను తీర్చుతున్నారు.

ఇదిలా ఉంటే..ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఇప్పటివరకు 9 కోట్ల మంది ప్రజలు ఉచిత LPG కనెక్షన్‌లను పొందారు. ఈ విషయాన్ని ఇండియన్ ఆయిల్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో వెల్లడించింది. ప్రభుత్వం ఈ పథకం కింద దేశంలోని APL, BPL, రేషన్ కార్డు కలిగిన మహిళలందరికీ ఉచితంగా LPG గ్యాస్ సిలిండర్, స్టవ్ అందజేస్తుంది. ఈ పథకం 1 మే 2016న ప్రారంభించారు. ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌కి మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 18 సంవత్సరాల దాటి ఉండాలి. వలస కార్మిక కుటుంబాలు రేషన్ కార్డు లేదా చిరునామా రుజువును దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories