Save Tax: ఐటీఆర్‌ ఫైల్‌ చేసేముందు ఇవి గమనించండి.. రూ.7 లక్షల వరకు పన్ను ఆదా..!

Note these before filing ITR Tax savings up to Rs.7 Lakhs
x

Save Tax: ఐటీఆర్‌ ఫైల్‌ చేసేముందు ఇవి గమనించండి.. రూ.7 లక్షల వరకు పన్ను ఆదా..!

Highlights

Save Tax: ఆర్థిక సంవత్సరం ముగింపు వచ్చింది. పన్ను చెల్లింపుదారులందరు వారి ఆదాయం ప్రకారం ఐటీఆర్‌ ఫైల్‌చేయాలి.

Save Tax: ఆర్థిక సంవత్సరం ముగింపు వచ్చింది. పన్ను చెల్లింపుదారులందరు వారి ఆదాయం ప్రకారం ఐటీఆర్‌ ఫైల్‌చేయాలి. అయితే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రూల్స్‌ 1961లోని సెక్షన్ల ప్రకారం ప్రభుత్వం కొన్నింటిపై పన్ను మినహాయింపు ఇస్తుంది. దీని గురించి పన్ను చెల్లింపుదారు తెలుసుకోవడం ముఖ్యం. వీటి సాయంతో రూ. 7 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. అంటే మొత్తం రూ. 12 లక్షల ఆదాయంపై జీరో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే పాత పన్ను విధానంలో, ప్రభుత్వం ఇప్పటికే రూ. 5 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు పన్ను ఆదా మార్గాల గురించి తెలుసుకుందాం.

ఇవే ఆ 6 మార్గాలు

1. మీ జీతం రూ.12 లక్షలు అయితే మీ హెచ్‌ఆర్‌ఏ రూ.3.60 లక్షలు, మీ ఎల్‌టీఏ రూ.10,000, ఫోన్ బిల్లు రూ.6,000 ఉండేలా మీరు దానిని రూపొందించవచ్చు. మీరు సెక్షన్ 16 ప్రకారం జీతంపై రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ పొందుతారు. రూ. 2500 వృత్తి పన్నుపై మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.

2. మీరు సెక్షన్ 10 (13A) కింద రూ.3.60 లక్షల హెచ్‌ఆర్‌ఏ, సెక్షన్ 10 (5) కింద రూ.10,000 ఎల్‌టీఏ క్లెయిమ్ చేయవచ్చు. ఈ తగ్గింపులతో మీ పన్ను చెల్లించదగిన జీతం రూ.7,71,500కి తగ్గుతుంది.

మీరు ఎల్‌ఐసి, పీపీఎఫ్‌, ఈపీఎఫ్‌ లలోఇన్వెస్ట్ చేసి ఉంటే మీ పిల్లల ట్యూషన్ ఫీజును చెల్లించినట్లయితే సెక్షన్ 80సి కింద రూ.1.50 లక్షల అదనపు మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.

3. నేషనల్ పెన్షన్ స్కీమ్ టైర్-1 స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన వారు సెక్షన్ 80CCD కింద రూ. 50,000 అదనపు మినహాయింపుకు అర్హులు. ఈ రెండు తగ్గింపుల తర్వాత మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 5,71,500 అవుతుంది.

4. సెక్షన్ 80D ఆరోగ్య బీమా పాలసీలపై చెల్లించిన ప్రీమియంలకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీకు మీ జీవిత భాగస్వామికి లేదా మీ పిల్లలకు ఆరోగ్య బీమా ప్రీమియం కోసం మీరు రూ. 25,000 క్లెయిమ్ చేసుకోవచ్చు.

5. మీ సీనియర్ సిటిజన్ తల్లిదండ్రుల ఆరోగ్య పాలసీలపై చెల్లించిన ప్రీమియం కోసం మీరు రూ. 50,000 అదనపు మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. దీనితో మీరు రూ. 75,000 తగ్గింపు ప్రయోజనం పొందుతారు. దీని కారణంగా మీ ఆదాయం రూ. 4,96,500కి తగ్గుతుంది.

6. ఈ పథకాలు కూడా పన్ను మినహాయింపు పరిధిలో ఉన్నాయి

ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF), ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ELSS), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), సుకన్య సమృద్ధి యోజన (SSY), సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS), 5 లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ (FDలు) పథకాలపై పన్ను మినహాయింపు ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ITR ఫైల్ చివరి తేదీ 31 జూలై 2024 అని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories