SSY Changes: వడ్డీరేటు పెరిగే ముందు సుకన్య సమృద్ధి యోజనలో 5 మార్పులు..!

Note 5 Changes in Sukanya Samriddhi Yojana Before Interest Rate Increases
x

SSY Changes: వడ్డీరేటు పెరిగే ముందు సుకన్య సమృద్ధి యోజనలో 5 మార్పులు..!

Highlights

SSY Changes: మీరు చిన్న పొదుపు పథకాలు పబ్లిక్‌ ఫ్రావిడెంట్‌ ఫండ్(PPF), సుకన్య సమృద్ధి యోజన(SSY), కిసాన్ వికాస్ పత్ర (NPS) మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టినట్లయితే గుడ్‌న్యూస్‌ అని చెప్పాలి.

SSY Changes: మీరు చిన్న పొదుపు పథకాలు పబ్లిక్‌ ఫ్రావిడెంట్‌ ఫండ్(PPF), సుకన్య సమృద్ధి యోజన(SSY), కిసాన్ వికాస్ పత్ర (NPS) మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టినట్లయితే గుడ్‌న్యూస్‌ అని చెప్పాలి. ప్రభుత్వం సెప్టెంబర్‌లో SSY, PPF వడ్డీ రేటులో మార్పులు చేస్తుందని సమాచారం. దీని ప్రత్యక్ష ప్రయోజనం స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులకు లభిస్తుంది. కేంద్రం కుమార్తెల కోసం అమలు చేస్తున్న SSY పథకంలో ప్రస్తుతం 7.60 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు సెక్షన్ 80C కింద ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందుతారు. SSYలో 5 ప్రధాన మార్పుల గురించి తెలుసుకుందాం.

1. సుకన్య సమృద్ధి యోజన కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో వార్షిక వడ్డీ జమ అవుతుంది. అంతకుముందు త్రైమాసిక ప్రాతిపదికన ఖాతాలో జమ చేసేవారు.

2. మునుపటి నిబంధనల ప్రకారం.. కుమార్తె 10 సంవత్సరాలలో ఖాతాను నిర్వహించవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం.. సంరక్షకుడు మాత్రమే 18 సంవత్సరాల వయస్సు వరకు ఖాతాను నిర్వహిస్తారు.

3. సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఏటా కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ. 1.5 లక్షలు జమ చేయాలనే నిబంధన ఉంది. కనీస మొత్తం డిపాజిట్ చేయకపోతే ఖాతా డిఫాల్ట్ అవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం.. ఖాతా మళ్లీ యాక్టివేట్ కాకపోతే మెచ్యూరిటీ వరకు ఖాతాలో జమ అయిన మొత్తంపై వడ్డీని చెల్లిస్తూనే ఉంటారు. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు.

4. ఇంతకుముందు 80సి కింద పన్ను మినహాయింపు ప్రయోజనం ఇద్దరు కుమార్తెలకి మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు మూడో కుమార్తె పుట్టిన తర్వాత ఖాతా తెరవవచ్చు. వాస్తవానికి మొదటి కుమార్తె తర్వాత జన్మించిన ఇద్దరు కవల కుమార్తెలకు ఈ అవకాశం ఉంటుంది.

5. కూతురు చనిపోతే లేదా కూతురు నివాసం మారినప్పుడు 'సుకన్య సమృద్ధి యోజన' ఖాతాను ముందుగా మూసివేయవచ్చు. అయితే ఇప్పుడు సంరక్షకుడు మరణించిన సందర్భంలో కూడా ఖాతాను ముందుగానే మూసివేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories