Employees: ఉద్యోగులకి అలర్ట్‌.. జూలై 1 నుంచి కొత్త చట్టం అమలు..!

New Wage Code From 1st July Increase Working Hours Salary is Low
x

Employees: ఉద్యోగులకి అలర్ట్‌.. జూలై 1 నుంచి కొత్త చట్టం అమలు..!

Highlights

Employees: జూలై 1 నుంచి కొత్త వేతన నియమావళిని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Employees: జూలై 1 నుంచి కొత్త వేతన నియమావళిని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల ప్రైవేట్‌ రంగ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది. మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. కొత్త వేతన నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల టేక్‌ హోమ్‌ సాలరీ తగ్గుతుంది. కానీ పీఎఫ్‌ ప్రయోజనం పెరుగుతుంది. కొత్త లేబర్ కోడ్ వల్ల ప్రయోజనాలు, అప్రయోజనాలు రెండూ ఉంటాయి.

ఉద్యోగి బేసిక్‌ వేతనం 30 నుంచి 40 శాతం వరకు ఉంటుంది. ఇది కాకుండా పెన్షన్ అలవెన్స్, HRA, PF మొదలైనవి ఉంటాయి. వీటి ఆధారంగా మీ జీతం నుంచి పీఎఫ్‌ కట్‌ అవుతుంది. కానీ ఇప్పుడు కొత్త నిర్మాణం ప్రకారం బేసిక్‌ వేతనం 50 శాతం ఉండాలి. ఇది మీ పీఎఫ్‌, గ్రాట్యుటీపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. కొత్త వేతన కోడ్ ప్రకారం వారానికి 48 గంటలు పనిచేయడం తప్పనిసరి. మీరు ప్రతిరోజూ 12-12 గంటలు పని చేస్తే మీకు 3 రోజుల సెలవు ఇచ్చే నిబంధన ఉంది.

కొత్త రూల్‌ని ఇలా అర్థం చేసుకోండి. ఉదాహరణకు మీ జీతం 50 వేలు అయితే మీ బేసిక్ ఇప్పుడు 15 వేల రూపాయలు అవుతుంది. దీని ప్రకారం మీ పీఎఫ్‌ నెలకు రూ. 1800 కట్‌ అవుతుంది (బేసిక్‌లో 12%). కానీ కొత్త రూల్ ప్రకారం 50 వేల సీటీసీపై మీ బేసిక్ 15 వేల నుంచి 25 వేల రూపాయలకు పెరుగుతుంది. దీనిపై మీ పీఎఫ్‌ సహకారం 12 శాతం మేర రూ. 3000కి పెరుగుతుంది. అంటే మీరు ముందు కంటే నెలకు రూ. 1200 తక్కువ పొందుతారు.

ప్రాథమిక జీతం పెరుగుదల

మీ పీఎఫ్, గ్రాట్యుటీ రెండింటిపై ప్రభావం ఉంటుంది. రెండు అంశాలలో కంట్రిబ్యూషన్‌లో పెరుగుదల వల్ల టేక్ హోమ్ జీతం తగ్గుతుంది. కానీ రిటైర్మెంట్‌ ఫండ్‌ పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories