వాట్సప్ లో కొత్త ఫీచర్.. కచ్చితంగా తెలుసుకోండి!

వాట్సప్ లో కొత్త ఫీచర్.. కచ్చితంగా తెలుసుకోండి!
x

WhatsApp 

Highlights

New Feature In Whataspp : ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి అతి తక్కువ టైంలో చేరువైన మెసేజింగ్ యాప్‌ వాట్సాప్.. ఇది ఎవరు కాదనలేని వాస్తవం..

New Feature In Whataspp : ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి అతి తక్కువ టైంలో చేరువైన మెసేజింగ్ యాప్‌ వాట్సాప్.. ఇది ఎవరు కాదనలేని వాస్తవం.. ప్రతి ఒక్కరు ఇప్పుడు దీన్ని వాడుతున్నారు.. అయితే రోజురోజుకూ సరికొత్త ఫీచర్ అ‌ప్‌డేట్స్‌తో యూజర్లను మరింతగా ఆకర్షిస్తుంది ఈ యాప్.. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా కొత్త కొత్త ఫీచర్లను అందిస్తోంది.. అయితే తాజాగా డిలీట్ ఫీచర్‌ను వాట్సాప్ మరింత అప్‌డేట్ చేస్తోంది వాట్సప్.

ప్రస్తుతం డెవలప్ చేస్తున్న ఫీచర్‌లో.. మనం అవతలి వారికి పోస్ట్ చేసిన చాట్ ఎప్పుడు డిలీట్ చేయాలనేది నిర్ణయించుకోవచ్చు. అంతేకాక చాట్ నుంచి బయటకు వస్తే మనం పంపిన సమాచారం అంతా డిలీట్ అయ్యేలా అప్‌డేట్ చేస్తోంది. ఈ ఫీచర్లను త్వరలో బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చి ఆ తర్వాత అందరికీ వర్తింపజేయనుంది.

అయితే దీనికి ముందు ఆ అవకాశం లేదు.. కేవలం నిర్ణీత సమయంలో మాత్రమే అవతలి వాళ్ల ఫోన్‌ నుంచి డిలీట్‌ చేసే అవకాశం ఉంది. ఆ సమయం అయిపోయిన తరవాత డిలీట్‌ చేయడం కుదరదు. అయితే దీనిని అధిగమించడానికి వాట్సాప్ బాగానే కసరత్తులు చేస్తోంది. అందులో భాగంగానే పంపిన సమాచారాన్ని ఎప్పుడు డిలీట్ చేయాలో ఎంచుకునే సెల్ఫ్‌ డిస్ట్రక్టింగ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది.

ఉదాహరణకి మీరు ఒక వ్యక్తీకి పంపిన డేటాను ఓ 10 నిమిషాల తర్వాత డిలీట్ చేయాలి అనుకుంటే సెండ్‌ బటన్‌ పక్కనున్న టైమర్‌లో ఆ టైం ని సెలెక్ట్‌ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది.. ఆ సమయం పూర్తి అయిన తర్వాత అదే ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. అంతేకాకుండా చాట్‌ నుంచి బయటకు వస్తే ఆటోమేటిగ్గా మీరు పంపిన డేటా అంతా డిలీట్‌ అయ్యేలా కూడా వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది. ఇది త్వరలో అందుబాటులోకి రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories